సాధారణంగా కిస్మిస్ రెగ్యులర్‌గా వాడుతుంటాం. అయితే, బ్లాక్ కిస్మిస్ను మాత్రం అంతగా పట్టించుకోం. నల్లని ఎండుద్రాక్ష ఆరోగ్యానికి విశేషంగా ప్రయోజనం చేకూరుస్తుంది. రక్తహీనత నివారణకు ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది. జీర్ణక్రియలో రుగ్మతలను నివారిస్తుంది. రక్తం కలుషితం కాకుండా కాపుకాస్తుంది. నల్లద్రాక్షను రోజూ తీసుకోవడం వల్ల శరీరానికిఅవసరమైన ఫైబర్ అందుతుంది.
నల్ల ఎండుద్రాక్ష గ్యాస్ సమస్యను నివారిస్తుంది. అలాగే రోజూ పది వరకు తింటే జీర్ణాశయంలో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది.
వీటిలోని యాసిడ్.. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది పెద్దపేగు క్యాన్సర్, ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. వీటినుంచి శరీరానికి సరిపడా కాల్షియం, పొటాషియం అందుతాయి. ఎముకలు గుల్లబారడాన్ని ఇవి నివారిస్తాయి.
బ్లాక్ కిస్మిస్లో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇందులో విటమిన్ సి కూడా ఉంటుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. కంటి సమస్యలు, చర్మ రుగ్మతలను కూడా బ్లాక్ కిస్మిస్ అడ్డుకుంటాయి.
నల్లద్రాక్షలో కాపర్ కూడా ఉంటుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపర్చి శరీరంలో అన్ని భాగాలకూ ఆక్సిజన్ అందడానికి దోహదం చేస్తుంది.
వీటికి క్యాన్సర్ కణాలను నియంత్రించే శక్తి ఉంటుంది. అంతేకాదు రక్తపోటు స్థాయులు స్థిరంగా ఉంటాయి. గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించడంలోనూ ఇవి బలంగా పనిచేస్తాయి. గుండె పనితీరును మెరుగుపరుస్తాయి.