పసుపు రంగు మన సంప్రదాయంలో ఎంత ప్రత్యేకమో… పట్టుచీరా అంతే విశేషం. ఈ రెండిటి మేలు కలయికగా కంచిపట్టులో కనువిందు చేస్తున్న ఈ చీర ఏ శుభకార్యానికైనా చక్కని ఎంపిక. లేత ఆకుపచ్చ, మామిడి పసుపు వన్నెల కలనేతగా.. చిన్న చిన్న పువ్వుల డిజైన్తో ముచ్చట గొలుపుతున్నది.
అంచుకు సరిపోయేలా వచ్చిన నిండు మామిడి రంగు ఎంబ్రాయిడరీ రవిక… ధరించిన వారిని పండు వెన్నెల్లా చూపిస్తుంది!
– సమతా చౌదరి, డిజైనర్
wowobySamathachowdari