Kota Doria Sarees | అంజలీ అగర్వాల్ గురుగ్రామ్‌లో పుట్టి పెరిగింది. అక్కడే చదువుకుంది. ఐబీఎంలో ఉద్యోగం సంపాదించింది. కానీ మనసులో ఏదో అసంతృప్తి. చిన్నప్పటి నుంచీ తనకు కోటా డోరియా సిల్కు చీరలంటే ఇష్టం. అమ్మమ్మ, అమ్మ కట్టుకున్నప్పుడు కండ్లప్పగించి చూసేది. అంత అందమైన వస్ర్తాలకు రావలసినంత పేరు రాలేదేమో అన్న అనుమానం కలిగింది అంజలికి.
నిజానికి కోటా డోరియా చేనేతకారుల ఆర్థిక పరిస్థితి కూడా అంతంతమాత్రమే. దళారీలు మాత్రం బాగుపడేవారు. ఓ ఇంజినీర్‌గా ఆ సమస్యను, పరిష్కార మార్గాలను విశ్లేషించింది. కోటా డోరియా చీరలు, సల్వార్ సూట్లు, దుపట్టాలు, కర్టెన్లు, కుషన్ తొడుగులు కొత్త డిజైన్లతో చేయించి.. దేశమంతా విక్రయిస్తున్నది. ఆన్‌లైన్‌లోనూ అమ్మకాలు ప్రారంభించింది. ఆమె చొరవ వల్ల వందల చేనేత కుటుంబాలు బాగుపడ్డాయి. ‘ఫ్యాషన్ స్పృహ ఉన్న మగువలకు పెట్టింది పేరైన హైదరాబాద్ నా తదుపరి కార్యస్థలం’ అని చెబుతున్నది అంజలీ అగర్వాల్. అంతేకాదు తమ వ్యాపారంలో 65 శాతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దక్షిణ భారతదేశం నుంచే ఉంటుందట.
ఎండాకాలంలో పెండ్లి కూతుళ్లు అందంగా కనిపించాలంటే ఇలా చేస్తే సరి!!
ఎండాకాలంలో పిల్లలకు హాయినిచ్చే ఈ దుస్తులను ట్రై చేయండి
Baggy Pants | అప్పట్లో కుర్రకారును ఉర్రూతలూగించిన ట్రెండ్ మళ్లీ వచ్చేసింది”
“ఒకప్పుడు చిన్న పిల్లలకే పరిమితమైన ఈ డ్రెస్.. ఇప్పుడు కాలేజీ అమ్మాయిలనూ ఆకట్టుకుంటుంది