e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, November 29, 2021
Home News ఫోర్బ్స్ జాబితాలో అజైత‌.. లాక్‌డౌన్‌లో ఒక్క ఆలోచ‌న ఆమె జీవితాన్నే మార్చేసింది

ఫోర్బ్స్ జాబితాలో అజైత‌.. లాక్‌డౌన్‌లో ఒక్క ఆలోచ‌న ఆమె జీవితాన్నే మార్చేసింది

Ajaita Shah
Ajaita Shah

Ajaita Shah | 2020.. ప్రపంచాన్ని కుదిపేసిన సంవత్సరం. కొవిడ్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించింది. ఆన్‌లైన్‌లోనే అన్నీ ఆర్డర్‌ చేసుకుని హాయిగా ఇంట్లోనే కాలక్షేపం చేశారు నగరవాసులు. ‘మరి గ్రామాల పరిస్థితి? లాక్‌డౌన్‌తో రవాణా ఆగిపోయింది. మారుమూల పల్లెల్లో పశువులకు దాణా ఎలా?’ అని ఆలోచించింది జైపూర్‌కు చెందిన అజైత షా. రోజూ కిలోమీటర్ల దూరం కాలినడకనే వెళ్లి పశువుల దాణా తెచ్చుకునే గ్రామీణ మహిళలకు అండగా నిలబడాలని నిశ్చయించుకుంది. ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేస్తే ఇంటికే దాణా చేరే అవకాశం కల్పించింది.

ఇప్పటివరకు రెండులక్షల మంది మహిళలకు పది లక్షల దాణా సంచులను సరఫరా చేసింది. దాణా వ్యాపారాన్ని ఇ-కామర్స్‌తో జతచేసి అత్యంత శక్తిమంతురాలైన ఆంత్రప్రెన్యూర్‌గా నిలిచింది అజైత. న్యూయార్క్‌లో పుట్టిపెరిగిన అజైతకు గ్రామీణ భారతం అంటే ప్రేమ. అందుకే చదువు అయిపోగానే ఇండియా వచ్చేసింది. పల్లెలకు ఇ-కామర్స్‌ను విస్తరిస్తూ ‘ఫ్రాంటియర్‌ మార్కెట్స్‌’ అనే స్టార్టప్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం రెండున్నర వేల గ్రామాల్లో పదివేలమంది మహిళా ఏజెంట్లు ఉన్నారీ సంస్థకు. సామాజిక వ్యాపార విజయంతో ‘అండర్‌ 30 పవర్‌ఫుల్‌ విమన్‌’గా ఫోర్బ్స్‌ జాబితాలోనూ చేరింది అజైత.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

వ‌జ్రాల వ్యాపారం చేస్తున్న ఏకైక మ‌హిళ రాధిక మ‌న్నె.. ఎవ‌రామె.. ఆమె స‌క్సెస్ సీక్రెట్ ఏంటి?

custard apple | సీతాఫ‌లాల‌తో ఐస్‌క్రీమ్‌లు త‌యారు చేస్తున్న పాల‌మూరు మ‌హిళ‌లు..

jai bhim | ఈమెదీ చినతల్లి లాంటి కథే.. కానీ న్యాయం ఇంకా జరగలేదు !

నీకు సినిమాలు అవసరమా? నువ్వేం చేయగలవు? అని హేళ‌న చేశారు.. కానీ..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement