ఉదయం లేవగానే ముఖం అందంగా కనిపించాలని కోరుకుంటాం. కానీ నిద్ర లేచి బద్ధకంగా అద్దం దగ్గరికి వెళ్లి చూడగానే.. అందులో ఉంది మనమేనా అన్నట్టుగా ముఖం కనిపిస్తే? రోజంతా డల్‌గానే సాగిపోతుంది. ఏడు గంటలు కులాసాగా నిద్రపోయినా.. అలా పాలిపోయి ఉండటం ఏమిటి? అంటే.. ముందురోజు రాత్రి తీసుకున్న ఆహారంపై మర్నాడు మన ముఖవర్చస్సు ఆధారపడి ఉంటుందట. షుగర్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ దిట్టంగా లాగించి నిద్రకు ఉపక్రమిస్తే.. తెల్లారి లేచే సరికి ముఖం బరువుగా కనిపిస్తుంది. ఇది మన చర్మంపై కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి మెరిసే చర్మం కోసం ఆరోగ్యకరమైన ఆహారం అవసరం. ఈసారి నిద్రకు ముందు ఇవి ట్రై చేసి చూడండి.. మార్పు మీరే గమనించండి.