టాలీవుడ్ నటి కాజల్ గ్లామరస్ రోల్స్ నుంచి బ్రేక్ తీసుకుని లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్టులు కూడా చేస్తోంది. తాజాగా ఉమ టైటిల్‌తో తెరకెక్కనున్న కొత్త సినిమాకు సంతకం చేసింది కాజల్. మన చుట్టూ పరిస్థితులు మెరుగైన వెంటనే వీలైనంత త్వరగా షూటింగ్ మొదలు పెట్టాలనుకుంటున్నా. ఫన్, ఎంటర్ టైనింగ్ సినిమాలు చేసేందుకు ఎప్పుడూ సిద్దమే. ఫన్, ఎంటర్ టైనింగ్ ఓ యాక్టర్ గా నాకు ఇప్పటికీ ఛాలెంజింగ్ లా అనిపిస్తుంది.
ఉమ చిత్రంలో నటిస్తున్నానని చెప్తున్నందుకు చాలా ఎక్జయిటింగ్ గా ఉందని కాజల్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. తథాగత సింఘ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. అవిషేక్ ఘోష్ నిర్మిస్తున్నారు. ఈ ఏడాది సెకండాఫ్ లో షూటింగ్ మొదలు పెట్టి చిత్రీకరణ పూర్తి చేయనున్నారు. కోవిడ్ ప్రొటోకాల్స్ అన్ని పాటిస్తూనే చిత్రీకరణ కొనసాగనుంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
అర్జున్ రెడ్డి భామ త్రోబ్యాక్ స్టిల్స్ హల్చల్
నెట్ ఫ్లిక్స్ లో తాప్సీ సినిమా
నేను ప్రేమలో ఉన్నా: అడివి శేష్
అలాంటి వాడు మొగుడుగా రావాలి..దివి మనసులో మాట
ఫారెస్ట్ ఆఫీసర్‌గా విద్యాబాలన్.. షేర్నీ ట్రైలర్ రిలీజ్