గురువారం 22 అక్టోబర్ 2020
Zindagi - Sep 03, 2020 , 23:58:46

ఇస్మార్ట్‌ కవచం..

ఇస్మార్ట్‌ కవచం..

ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నారా! ఎదుటి వ్యక్తికి ఆరుగజాల దూరంలో  ఉండాలన్న నియమం మర్చిపోతున్నారా..! ఈ స్మార్ట్‌ జాకెట్‌ వేసుకుంటే.. ఇక ఏ టెన్షనూ అవసరం లేదు. కరోనా కౌగిట చిక్కకుండా ఇది ఎప్పటికప్పుడూ మిమ్మల్ని అలర్ట్‌ చేస్తుంది.

కరోనా వైరస్‌ బారి నుంచి తప్పించేందుకు ఫేస్‌మాస్కులు తప్పనిసరిగా మారాయి. అయినా.. పని చేసే చోట భౌతిక దూరం పాటించాలన్న స్పృహ చాలామందిలో కలగడం లేదు. ముఖ్యంగా జనసాంద్రత ఉన్న ప్రాంతాలకు వెళ్లినప్పుడు ప్రతి నిమిషమూ ప్రమాదకరంగానే ఉంటున్నది. ఈ సమస్యను పరిష్కారించేందుకు ప్రొఫెసర్‌ సోమేశ్‌ సింగ్‌, జాతీయ అవార్డు గ్రహీత అబ్దుల్‌ జబ్బర్‌ ఖాత్రి సహకారంతో స్మార్ట్‌ జాకెట్స్‌ కోవెస్ట్‌ రూపొందించారు. ఈ జాకెట్‌ కేవలం రక్షణ, సూచనలు ఇచ్చేందుకు రూపొందించారు.  స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ స్మార్ట్‌ కోట్‌ ధరించడం వల్ల కరోనా కోరల్లో చిక్కకుండా ఉండొచ్చు.ఉష్ణోగ్రత చెప్పేస్తుంది..జాకెట్‌లో అమర్చిన సెన్సర్లు శరీర ఉష్ణోగ్రతను కనిపెడుతాయి. జాకెట్‌పై ఉండే డిస్‌ప్లేలో టెంపరేచర్‌ వివరాలు చూసుకోవచ్చు.

దూరం దూరం..

ఈ జాకెట్‌ ధరించి పొరపాటున ఎవరి సమీపానికైనా వెళ్లారంటే.. వెంటనే అలర్ట్‌ చేస్తుంది. రెండు మీటర్ల దూరాన్ని పాటించేలా సూచనలిస్తుంది.

అనుక్షణం పరిశుభ్రంగా..

జాకెట్‌కు ఉండే పాకెట్లలో డ్రై శానిటైజేషన్‌ సౌకర్యం ఉంది. మీ జేబుల్లో వేసుకునే వాచ్‌, సన్‌ గ్లాసెస్‌, వాలెట్స్‌, కార్‌ కీ, జేబు రుమాలు లాంటి వాటిని ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేస్తుంది.

వైరల్‌ షీల్డ్‌ 

ఈ వైరల్‌ షీల్డ్‌ శరీరానికి ఎలాంటి ఇన్‌ఫెక్షన్‌ సోకకుండా చూస్తుంది. అదే విధంగా ఆర్మోథెరపీ ద్వారా ఒత్తిడికి గురికాకుండా కాపాడుతుంది. ఇన్‌బిల్ట్‌ ప్రొటెక్టీవ్‌ ఫేస్‌ మాస్క్‌ కూడా ఈ జాకెట్‌కు ఉంది.


logo