సైన్యంలో.. మహిళా కల్నల్స్!
‘ఇన్నాళ్లకు నాయకత్వ స్థానాల్లో ప్రతిభ కనబరిచే అవకాశం వచ్చింది. కల్నల్ హోదాలో సైన్యాన్ని ముందుకు నడుపుతాం’ అని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు ఆ సైనిక సివంగులు.
‘ఇన్నాళ్లకు నాయకత్వ స్థానాల్లో ప్రతిభ కనబరిచే అవకాశం వచ్చింది. కల్నల్ హోదాలో సైన్యాన్ని ముందుకు నడుపుతాం’ అని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు ఆ సైనిక సివంగులు. నిజంగా ఇది చారిత్రక సందర్భం. సైన్యంలో పనిచేస్తున్న 108 మంది మహిళా అధికారులకు తొలిసారి పదోన్నతి కల్పించారు. కల్నల్ హోదా సాధించే అవకాశం ఇచ్చారు. వార్షిక పనితీరు నివేదికల ఆధారంగా వారికి ప్రమోషన్లు లభిస్తాయి. గతంలో మహిళలకు ఆ వెసులుబాటు లేదు.
2020లో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పు నేపథ్యంలో ‘కల్నల్ హోదా’ కల నిజం కానున్నది. సైన్యంలో బ్రిగేడియర్, మేజర్ జనరల్ లాంటి అనేక హోదాలున్నా క్షేత్రస్థాయిలో సైన్యంతో నేరుగా సంబంధాలు కలిగి ఉండేది ఒక్క కల్నల్ మాత్రమే. ఇన్నాళ్లకు ఆ అవకాశం రావడం సాధికారత దిశగా ముందడుగని మహిళా అధికారులు సంబురపడుతున్నారు. ప్రస్తుతం ఆర్మీలో 1,705 మంది, ఎయిర్ ఫోర్స్లో 1,640 మంది, నేవీలో 509 మంది మగువలు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

