సుందరం.. శివుడి మందిరం
హరిహరులకు భేదం లేదని చెప్పే దివ్యక్షేత్రం యాదగిరిగుట్ట. కొండమీద గుహలో నరసింహుడు, ఆ చెంతనే హరుడు కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ క్షేత్రం పునర్నిర్మాణంలో భాగంగా.. శివాలయాన్ని కూడా అభివృద్ధి చేశారు. ఆలయ పునః ప్రారంభానికి ఈ నెల 25న ముహూర్తం నిర్ణయించారు
హరిహరులకు భేదం లేదని చెప్పే దివ్యక్షేత్రం యాదగిరిగుట్ట. కొండమీద గుహలో నరసింహుడు, ఆ చెంతనే హరుడు కొలువై
భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ క్షేత్రం పునర్నిర్మాణంలో భాగంగా.. శివాలయాన్ని కూడా అభివృద్ధి చేశారు. ఆలయ పునః ప్రారంభానికి ఈ నెల 25న ముహూర్తం నిర్ణయించారు. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన శివయ్య మందిరం విశేషాలు..
యాదాద్రి క్షేత్రం మొదటినుంచీ హరిహర క్షేత్రంగా విరాజిల్లుతున్నది. లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చిన భక్తులు కొండపై ఉన్న శివాలయాన్ని సందర్శిస్తారు. ప్రధాన ఆలయం అభివృద్ధిలో భాగంగా శివాలయాన్నీ విస్తరించారు. గతంలో 500 చదరపు గజాల్లో ఆలయం ఉండేది. ఇప్పుడు ఎకరం విస్తీర్ణంలో అద్భుతంగా తీర్చిదిద్దారు. అత్యాధునిక హంగులతో శివుడి కోవెలను అభివృద్ధి చేశారు. చుట్టూ ప్రాకారంతో ప్రధాన ఆలయాన్ని కళాత్మక నిలయంగా మార్చారు. నవగ్రహ మంటపం, ఆంజనేయస్వామి మంటపం, మరకత మంటపం నిర్మించారు. శివాలయం లోపలి రాతి ముఖమంటపంలో ఆంజనేయస్వామి దేవాలయం, గణపతి దేవాలయం, పర్వతవర్ధిని అమ్మవారి దేవాలయం, యాగశాల నిర్మించారు.
ప్రాకారం సాలహారంలో అద్భుత శిల్పాలను కొలువుదీర్చారు. అష్టాదశ శక్తిపీఠాలు, ద్వాదశ జ్యోతిర్లింగాల నమూనా మూర్తులను ఏర్పాటుచేశారు. శివాలయం ముఖమంటపం ఎదురుగా ధ్వజస్తంభానికి వెనుక వైపు ఆవరణలో ప్రత్యేక పీఠంపై నంది విగ్రహాన్ని రూపొందించారు. భక్తుల రద్దీకి తగ్గట్టుగా ఆలయంలో ఏర్పాట్లు చేశారు. కల్యాణ మంటపం, రథశాలలను అడుగడుగునా ఆధ్యాత్మికత తొణికిసలాడే విధంగా తీర్చిదిద్దారు. కార్తిక మాసంలో దీపోత్సవం నిర్వహించడానికి వీలుగా ఆలయ ప్రాంగణంలో దీపాల మంటపాన్ని నిర్మించారు. ఆలయానికి తూర్పు రాజగోపురం నుంచి వచ్చే విధంగా క్యూలైన్లు ఏర్పాటుచేశారు.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

