కండరాలకు అండగా!

శరీర సత్తువంతా కండరాల్లోనే ఉంటుంది. కండరాలు బలంగా ఉన్నప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. రోజువారీ శ్రమ, ఇతర శారీరక కారణాల వల్ల కండరాల్లో చిన్నపాటి సమస్యలు ఉత్పన్నం అవుతూ ఉంటాయి. అయితే, కండరాలు వాటంతట అవే ఆ సమస్యలను అధిగమిస్తూ ఉంటాయి. ప్రత్యేక కణాల ఉత్పత్తి వల్ల కండరాలు మళ్లీ బలం పుంజుకుంటూ ఉంటాయి. ఈ కణాల ఉత్పత్తి మీదే కండరాల ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మనం తీసుకునే డైట్లో గ్లూకోజ్ అధిక మోతాదులో ఉంటే ఈ ప్రత్యేక కణాల ఉత్పత్తి మందగిస్తుందని గుర్తించారు జపాన్‌లోని టోక్యో మెట్రోపాలిటన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు. శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉన్నప్పుడు కండరాల్లో స్కెలిటల్ కణాలు విరివిగా విడుదల అవుతాయట. ఇలా ఉత్పత్తి అయిన కణాలు కండరాల్లోని లోపాలను ఎప్పటికప్పుడు సరి చేస్తాయని చెబుతున్నారు పరిశోధకులు. అదే గ్లూకోజ్ స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు వీటి ఉత్పత్తి చాలా తక్కువగా ఉంటుందట. ఫలితంగా కండరాల్లోని లోటుపాట్లు సరిదిద్దుకునే అవకాశం తగ్గిపోతుంది. ఇదే పరిస్థితి దీర్ఘకాలం కొనసాగితే కండరాలు బలహీనం అయ్యే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అందుకని డైట్లో చక్కెరకు తావివ్వకుండా, గ్లూకోజ్ తక్కువగా ఉండే ఆహార పదార్థాలకు చోటివ్వాలని సూచిస్తున్నారు.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

