అమ్మాయిలు ఆపాదమస్తకం అందంగా కనపడాలని కోరుకుంటారు. అందుకు తగినట్లుగానే అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ, ఎన్ని సౌందర్య చిట్కాలు పాటించినా, సీజనల్‌గా కొన్ని సమస్యలు పలకరిస్తూనే ఉంటాయి. వానకాలంలో తేమ ఎక్కువగా చేరి పాదాల్లో పగుళ్లు ఏర్పడతాయి. వాటిలోకి ఫంగస్ చేరి ఇన్ఫెక్షన్కు దారితీస్తుంది. వర్షాకాలం వచ్చేసింది.. ఈ కాలంలో పాదాల పగుళ్లు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో చూద్దాం..
డ్రై స్కిన్ ఉన్నవారికి పాదాలు ఎక్కువగా పగులుతాయి. యాంటి మైక్రోబియల్, యాంటి బ్యాక్టీరియల్ గుణాలున్న తేనె.. పగిలిన పాదాలకు చక్కని మాయిశ్చరైజర్‌గా పని చేస్తుంది. రోజూ రాత్రిపూట పాదాలకు పగుళ్లు ఉన్నచోట కొద్దిగా తేనె రాసి అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పగుళ్లు తగ్గుముఖం పడతాయి.