దుబాయ్: రెండుసార్లు ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్స్ (డబ్ల్యూటీసీ) రన్నరప్‌గా నిలిచిన భారత జట్టు.. 2025-27 సైకిల్లో ఆ రేసు నుంచి క్రమంగా దూరమవుతున్నది. తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్ ఘనవిజయం సాధించడంతో ఆ జట్టు ఐదో స్థానానికి ఎగబాకింది. దీంతో భారత జట్టు ఆరోస్థానానికి పడిపోయింది. వచ్చే ఏడాది ఆగస్టు వరకూ గిల్ సేన టెస్టులు ఆడదు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో భారత జట్టు మరిన్ని స్థానాలు దిగజారడం ఖాయంగానే కనిపిస్తున్నది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, శ్రీలంక, పాకిస్థాన్, న్యూజిలాండ్.. భారత్ కంటే ముందున్నాయి.