హైదరాబాద్, సిటీబ్యూరో, డిసెంబరు 12 (నమస్తే తెలంగాణ): అఖిల భారత పోలీస్ సెపక్తక్రా చాంపియన్‌షిప్‌లో సైబరాబాద్ కమిషనరేట్‌కు చెందిన మనోజ్‌కుమార్ మధుబన్(హర్యానా)లో జరిగిన ఆల్ఇండియా పోలీస్ చాంపియన్‌షిప్‌లో రెండు పతకాలతో సత్తాచాటాడు. ఈ క్రమంలో వరుసగా మూడో ఏడాది జలంధర్(2022), నాగపూర్(2024), మధుబన్(2025)లో ఐదు కాంస్య పతకాలు కైవసం చేసుకున్నాడు. ఈ సందర్భంగా మనోజ్‌ను సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి, ఇతర పోలీసులు అధికారులు అభినందించారు. దక్షిణాసియా ప్రాంతంలో ప్రముఖ క్రీడగా పేరొందిన సెపక్తక్రా ఆటలో మనోజ్ అద్భుత ప్రతిభ కనబరుస్తున్నాడు. చురుకుదనం, సమతుల్యత, ప్రతిచర్య అవసరమైన ఈ క్రీడ సవాలుతో కూడుకున్నదిగా పేరుగాంచింది.