చెన్నై: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ తనను టీవీకే అధ్యక్షుడు విజయ్ రాజకీయాలతో ముడి పెట్టి మాట్లాడటంపై సినీ నటి త్రిష సోమవారం స్పందించారు. అగౌరవాన్ని ఎప్పటికీ సహించనని తన న్యాయవాది ద్వారా చేసిన అధికారిక ప్రకటనలో స్పష్టం చేశారు.
తాను తటస్థంగా ఉన్నానని, తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని, సంబంధం పెట్టుకొనే ఉద్దేశమూ లేదని తెలిపారు. మొదట విజయ్ త్రిష ప్రభావం నుంచి బయటకు వచ్చి తన కుటుంబంపై దృష్టి సారించాలని కొన్ని రోజుల క్రితం తమిళనాడు బీజేపీ చీఫ్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వచ్చాయి. దీంతో ఆయన క్షమాపణలు చెప్పారు.