ఫరీదాబాద్: హర్యానాలోని పల్వాల్ జిల్లా చయన్సా గ్రామంలో 15 రోజుల్లో 12 మంది మరణించడం ఆందోళన కలిగిస్తున్నది. మృతుల్లో అయిదుగురు స్కూల్ విద్యార్థులు ఉన్నారు. వీరందరి మరణాలకు కలుషిత నీళ్లే కారణమని వైద్యాధికారులు అనుమానిస్తున్నారు.
అయితే మరణాలకు గల సరైన కారణం ఇప్పటికీ తెలియరాలేదు. ప్రతి ఇంట్లో ఒకరు జ్వరం, దగ్గు, ఒళ్లు నొప్పుల వంటి సమస్యలతో బాధ పడుతున్నారు. అతమ గ్రామానికి సరఫరా అవుతున్న తాగునీరు శుభ్రంగా లేకపోవడమే అనారోగ్యాలకు కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.