మహబూబాబాద్ రూరల్, జూలై 28 : మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ ఎదుట మిర్చి రైతులు ఆందోళన చేపట్టారు. తమ మి ర్చి కొనుగోలు చేసిన వ్యాపారి డబ్బులు ఇవ్వకుండా మూడు నెలల నుంచి తిప్పుతున్నాడ ని తొమ్మిది మంది రైతులు మంగళవారం మా ర్కెట్‌కు తాళం వేసి నిరసన తెలిపారు. రైతుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లాలో ని వివిధ మండలాలకు చెందిన రైతులు గత మే నెలలో వ్యవసాయ మార్కెట్లో ఎన్ఎస్ ట్రేడ్ వ్యాపారి లాలుకు తమ మిర్చి పంటను అమ్మారు.
అందులో కొంతమంది రైతులకు డబ్బులిచ్చి మిగతా వారికి ఇవ్వలేదు. రెడ్యాలకు చెందిన ఉప్పనూతల మధుకర్‌కు రూ. 3 లక్షలు, చింతల రాములుకు రూ.2.83 లక్ష లు, సీహెచ్ వెంకన్నకు రూ. 5 లక్షలు, మూ డు హోలికి రూ. 3.10 లక్షలు, ముత్యం సర్వేశ్‌కు రూ. 3 లక్షలు, షేక్ సుభాన్కు రూ. 1.75 లక్షలు, భూక్యా రవికి రూ. 1.88 లక్షలు ఇవ్వాలి. వీరు మూడు నెలలుగా తిరుగుతున్నా డబ్బులివ్వడం లేదు. ఈ నెల 6న వ్యవసాయ మార్కెట్ కమిటీ పా లక వర్గం వద్దకు పిలిపించి రెండు వారాల్లో డబ్బులిచ్చేలా ఒప్పంద పత్రం రాయించుకున్నారు.
మూడు రోజులుగా డబ్బులడుగుతుంటే లాలు పట్టించుకోవడం లేదని, సోమవారం సాయం త్రం నుంచి ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తున్నదని రైతు లు వాపోయారు. డబ్బులు ఇప్పించి న్యా యం చేయాలని మార్కెట్ ఎదుట నిరసన చే స్తున్నట్లు తెలిపారు. కాగా, ఈ క్రమంలో మూ డు హోలి అనే రైతు ఆవేశంతో ఒంటిపై పెట్రో ల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అక్కడే ఉన్న టౌన్ పోలీసులు బాటిల్ లాక్కొని అతడిని కాపాడారు. అనంతరం మ ళ్లీ పురుగుల మందు తాగేందుకు యత్నించగా అడ్డుకున్నారు. టౌన్ సీఐ రఘుపతిరెడ్డి, ట్రా ఫిక్ ఎస్సై అరుణ్‌కుమార్ హోలితో పాటు మి గతా రైతులకు సర్ది చెప్పి ఆందోళన విరమింపజేశారు. అధికారులు మిర్చి డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలని రైతులు కోరారు.