కరెంట్ కోతలపై రైతుల ఆగ్రహం.. గద్వాల–అయిజ రహదారిపై భారీ ధర్నా
వ్యవసాయానికి అవసరమైన సమయంలో విద్యుత్ సరఫరా అందకపోవడంపై రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సాగునీటి కోసం ఎదురుచూస్తున్న వేళ తరచూ కరెంట్ అంతరాయాలు ఏర్పడటంతో పంటలు నష్టపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
గద్వాల: వ్యవసాయానికి అవసరమైన సమయంలో విద్యుత్ సరఫరా అందకపోవడంపై రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సాగునీటి కోసం ఎదురుచూస్తున్న వేళ తరచూ కరెంట్ అంతరాయాలు ఏర్పడటంతో పంటలు నష్టపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యుత్ కోతలను నిరసిస్తూ మల్దకల్ సబ్‌స్టేషన్ ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. గద్వాల–అయిజ ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. వ్యవసాయ మోటార్లకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సరఫరా విషయంలో అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.
రైతులు రహదారిపై బైఠాయించడంతో గద్వాల–అయిజ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రహదారికి ఇరువైపులా వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించే చర్యలు చేపట్టారు. రైతుల ఆందోళన కొనసాగుతుండటంతో ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

