Bollaram | బొల్లారం ఆయుధాల దోపిడీ కేసులో 2 వారాల తర్వాత వీడిన మిస్టరీ.. నలుగురు అరెస్ట్
Bollaram | సికింద్రాబాద్ బొల్లారం ప్రాంతంలోని 20 మద్రాస్ ఆర్మీ రెజిమెంట్లో ఆయుధాల చోరీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రెండు వారాల తర్వాత ఈ కేసు మిస్టరీని హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు ఛేదించారు.
Bollaram | సికింద్రాబాద్ బొల్లారం ప్రాంతంలోని 20 మద్రాస్ ఆర్మీ రెజిమెంట్లో ఆయుధాల చోరీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రెండు వారాల తర్వాత ఈ కేసు మిస్టరీని హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు ఛేదించారు. ఆయుధాల దోపిడీకి పాల్పడిన మాజీ మిలిటరీ అధికారి సహా నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
రెండు నెలల క్రితమే రిటైర్ అయిన ఓ మాజీ మిలిటరీ అధికారి ఈ దోపిడీకి ప్రధాన సూత్రధారిగా పోలీసులు గుర్తించారు. ఆయనకు మరో ముగ్గురు మిలిటరీ అధికారులు సహకరించినట్లు దర్యాప్తులో తేలింది.
చెడు వ్యసనాలకు బానిసై ఆయుధాలను దోపిడీ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా టాస్క్ఫోర్స్ పోలీసులు 12 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. తెల్లవారుజామున హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వారి వద్ద నుంచి చోరీకి గురైన ఆయుధాలు, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

