తిరువీర్, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘భగవంతుడు’. జి.జి.విహారి దర్శకుడు. రవి పనస ఫిల్మ్ కార్పొరేషన్ పతాకంపై రవి పనస ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రొమాంటిక్ పీరియడ్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఇటీవలే ఈ చిత్రం నుంచి రెండో పాట ‘సిత్తరాల నవ్వు’ విడుదలైంది.
కృష్ణప్రసాద్ స్వరపరచిన ఈ పాటకు జి.జి.విహారి సాహిత్యాన్ని అందించారు. జావెద్ అలీ ఆలపించారు. ‘సిత్తరాల నవ్వు..అరే సిలకల్లే నువ్వు, చేమంతి పువ్వు, నీలాల కళ్లు..’ అంటూ కథానాయిక అందాన్ని వర్ణిస్తూ ఈ పాట సాగింది. పల్లెటూరి నేపథ్యంలో విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ చిత్రానికి సంగీతం: కె.పి, కథ, దర్శకత్వం: జి.జి.విహారి.