ఐక్యపోరాటాలతోనే బీసీల హక్కులు సాధ్యం
చట్టసభల్లో 50 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీలంతా ఐక్యంగా ఉద్యమించాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. భూస్వాముల ఆధిపత్యానికి వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ ఎలా పోరాడిందో, అదే స్ఫూర్తితో ఉద్యమించాలని సూచించారు.
- బీసీ నేత, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య
- రజకులు హక్కుల కోసం ఉద్యమించాలి
- కార్మికశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి
- రవీంద్రభారతిలో ఐలమ్మ జయంత్యుత్సవం
- విద్యానగర్‌లో బీసీ ఉద్యోగుల సమావేశం
రవీంద్రభారతి/కవాడిగూడ, సెప్టెంబర్ 26 : చట్టసభల్లో 50 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీలంతా ఐక్యంగా ఉద్యమించాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. భూస్వాముల ఆధిపత్యానికి వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ ఎలా పోరాడిందో, అదే స్ఫూర్తితో ఉద్యమించాలని సూచించారు. శనివారం రవీంద్రభారతిలో వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని నిర్వహించారు. కార్యక్రమానికి ఆర్ కృష్ణయ్య, మంత్రి వివేక్, ప్రభుత్వ సలహాదారు వీ హనుమంతరావు తదితరులు పాల్గొని ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీలు కలిసికట్టుగా పోరాడితేనే పార్లమెంట్లో బిల్లు పెడుతారని పేర్కొన్నారు. మంత్రి వివేక్ మాట్లాడుతూ.. రజకులు తమ హక్కుల కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీసీ కమిషన్ చైర్మన్ టీ నిరంజన్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా విద్యానగర్‌లోని బీసీ భవన్లో శనివారం జరిగిన ప్రభుత్వ బీసీ ఉద్యోగుల సమావేశంలో ఆర్ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

