డీహెచ్ఎల్ ధరల పెంపు!
లాజిస్టిక్ ఆపరేటర్ డీహెచ్ఎల్ ఎక్స్ప్రెస్..సరుకు రవాణా చార్జీలను పెంచబోతున్నట్టు ప్రకటించింది. జనవరి 1 నుంచి అమలులోకి వచ్చేలా సరుకు రవాణా చార్జిలను 8.9 శాతం వరకు సవరిస్తున్నట్టు ఒక ప్రకటనలో వెల్లడించింది. వార్షిక ధరల పెంపు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, కరెన్సీ హెచ్చుతగ్గులు, పరిశ్రమల వ్యయం అంతకంతకు పెరగడంతో సంస్థపై పడుతున్న అదనపు భారాన్ని తగ్గించుకోవడంలో భాగంగా కొన్ని ఖర్చులను సర్దుబాటు చేయడానికి చార్జీలను సవరిస్తున్నట్టు వెల్లడించింది.
ముంబై, సెప్టెంబర్ 25: లాజిస్టిక్ ఆపరేటర్ డీహెచ్ఎల్ ఎక్స్ప్రెస్..సరుకు రవాణా చార్జీలను పెంచబోతున్నట్టు ప్రకటించింది. జనవరి 1 నుంచి అమలులోకి వచ్చేలా సరుకు రవాణా చార్జిలను 8.9 శాతం వరకు సవరిస్తున్నట్టు ఒక ప్రకటనలో వెల్లడించింది. వార్షిక ధరల పెంపు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, కరెన్సీ హెచ్చుతగ్గులు, పరిశ్రమల వ్యయం అంతకంతకు పెరగడంతో సంస్థపై పడుతున్న అదనపు భారాన్ని తగ్గించుకోవడంలో భాగంగా కొన్ని ఖర్చులను సర్దుబాటు చేయడానికి చార్జీలను సవరిస్తున్నట్టు వెల్లడించింది.
సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంతో భారత్తోపాటు 220 దేశాల్లో ఉన్న కస్టమర్లపై ఆర్థిక ప్రభావం చూపనున్నది. ఈ వార్షిక ధరల సర్దుబాటు, వినియోగదారులు ఆశించే ఉన్నత స్థాయి సేవలు, విశ్వసనీయతను కొనసాగించడానికి, అలాగే ప్రపంచవ్యాప్త కార్యకలాపాల స్థితిస్థాపకత, అనుకూలతను బలోపేతం చేయడానికి వీలు కల్పించనున్నట్టు డీహెచ్ఎల్ ఎక్స్ప్రెస్ సౌత్ ఏషియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆర్ఎస్ సుబ్రమణియన్ తెలిపారు. ద్రవ్యోల్బణంతోపాటు కస్టమ్స్, నియంత్రణ, భద్రతా విధానాలకు సంబంధించిన నిబంధనల అమలు, పరిపాలన ఖర్చులు, ఇంధన వ్యయాలు వంటి అంశాలు ఆర్థిక ప్రగతిపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

