హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వాయుగుండం ప్రభావం తగ్గడమేకాకుండా, ఈ సీజన్‌కు సంబంధించి వర్షాలు దాదాపుగా ముగియడంతో ఆదివారం నుంచి అక్టోబర్ 2 వరకు వాతావరణం పొడిగా మారి ఎండల తీవ్రత పెరుగనున్నది. చాలా ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 34 నుంచి 36 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే సూచనలు ఉన్నాయని, దీంతో ఉకపోత పెరుగనున్నదని శనివారం వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.
అయితే, ఈశాన్య రుతుపవనాల రాకకు ముందుగా వీచే తూర్పు గాలుల ప్రభావం కారణంగా అక్టోబర్ 3 నుంచి 10వరకు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అకడకడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని అధికారులు తెలిపారు.