మహబూబాబాద్ రూరల్, ఫిబ్రవరి 16: మానుకోట మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికలో కాంగ్రెస్ తరఫున సమర్థులు లేక స్వతంత్ర అభ్యర్థి గుగులోత్ జ్యోతికి పట్టం కట్టిన విచిత్ర పరిస్థితి నెలకొన్నదని సీపీఐ సహాయ కార్యదర్శి (కౌన్సిలర్) బీ అజయ్సార థి ఎద్దేవాచేశారు. సోమవారం మున్సిపల్ ఆఫీస్ ఆవరణలో బీఆర్ఎస్ కౌ న్సిలర్లతో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాలకే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ప్రారంభమైందని చెప్పారు.
ఈనెల 11న జరిగిన మానుకోట మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీని ఓటర్లు తిరస్కరించినందునే 36 వార్డుల్లో కేవలం 13 వార్డులు గెలిచినట్టు తెలిపారు. గెలిచిన స్వతంత్ర అభ్యర్థులను ఎత్తుకెళ్లి నిర్బంధించారని ఆరోపించారు. కాంగ్రెస్ వార్డు సభ్యు లు సమర్థులు కానందునే ఎమ్మెల్యే మురళీనాయక్ స్వతంత్రులను ప్రలోభాలకు గురిచేసి పార్టీలో చేర్చుకుని, స్వతంత్ర అభ్యర్థి గుగులోత్ జ్యోతికి చైర్పర్సన్ పదవి కట్టబెట్టారని పేర్కొన్నారు. వైస్ చైర్మన్ పదవి సైతం కాంగ్రెస్ అభ్యర్థులకు ఇవ్వకుండా సీపీఎం నేత సోమయ్యను ఎన్నుకున్నట్టు తెలిపారు.