పుణె: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ లీగ్ దశలో సత్తాచాటిన హైదరాబాద్.. సూపర్ లీగ్ స్టేజ్‌లోనూ అదే జోరును కొనసాగిస్తున్నది. డిఫెండింగ్ చాంపియన్స్ ముంబైతో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. సిరాజ్ (3/17), కెప్టెన్ మిలింద్ (2/36), త్యాగరాజన్ (2/27) ధాటికి మొదట ముంబై18.5 ఓవర్లలో 131 రన్స్‌కే పరిమితమైంది. స్వల్ప ఛేదనను హైదరాబాద్ 11.5 ఓవర్లలోనే ఒక వికెట్ మాత్రమే కోల్పోయి దంచేసింది. తన్మయ్ (40 బంతుల్లో 75, 7 ఫోర్లు, 4 సిక్స్‌లు), అమన్ రావు (52*) రాణించారు. సిరాజ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.