ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Yadadri - Feb 19, 2021 , 03:23:36

శ్రీకారం పాతగుట అధ్యయనోత్సవాలు షురూ

శ్రీకారం పాతగుట అధ్యయనోత్సవాలు షురూ

  • తిరుమంజనం, తొళక్కంతో ప్రారంభమైన ఉత్సవాలు
  • మూడు రోజులపాటు జరుగనున్న వేడుకలు

యాదాద్రి పుణ్యక్షేత్రానికి అనుబంధ ఆలయంగా ఉన్న పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అధ్యయనోత్సవాలు గురువారం అంగరంగవైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రత్యేక సేవపై స్వామి అమ్మవార్లతో ఆళ్వార్‌ స్వాములను  అలంకరించి  నిత్య ఆరాధనలు చేశారు. అనంతరం తిరుమంజన మహోత్సవం పాంచరాత్రగమ సంప్రదాయ రీతిలో అత్యంత వైభవంగా నిర్వహించారు. సాయంత్రం తొళక్కంతో ఉత్సవాలను ప్రారంభించి వేద పారాయణం చేశారు.  - యాదాద్రి, ఫిబ్రవరి18 

 యాదాద్రి, ఫిబ్రవరి 18: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రానికి అనుబంధ ఆలయంగా ఉన్న పాతగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నాలుగు రోజుల పాటు జరి గే అధ్యయనోత్సవాలకు గురువారం అంగరంగవైభవంగా, శాస్ర్తోక్తంగా అర్చకులు శ్రీకారం చుట్టారు. ప్రత్యేక సేవపై శ్రీస్వామి అమ్మవార్లతో ఆళ్వార్‌ స్వాములను  అలంకరిం చారు. ఆలయంలో నిత్య ఆరాధనల అనంతరం తిరుమం జన మహోత్సవం పాంచరాత్రగమ సంప్రదాయ రీతిలో ప్రధానార్చకులు, అర్చకులు, పారాయణికులు, వేద పండి తులు అత్యంత వైభవంగా నిర్వహించారు. సాయంత్రం తొళక్కంతో ఉత్సవాలను ప్రారంభించారు. ఆలయం మం డపంలో సేవకు అర్చకులు, పారాయణికులు, రుత్వికులు వేద పారాయణాలను ఆలపించారు. శుక్రవారం ఉదయం తిరుమంజనం నిర్వహించిన అనంతరం సాయంత్రం దివ్య ప్రబంధంతో పాటు పురపాట్‌ సేవ నిర్వహిస్తామని ఆలయ అర్చకులు తెలిపారు. కొవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ ఆలయంలోనే ఉత్సవాలను నిర్వహించారు. ఈ అధ్యయ నోత్సవాల్లో  ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూ ర్తి, కార్యనిర్వహణాధికారి గీత, సహాయ కార్యనిర్వహణాధి కారులు, పర్యవేక్షకులు, ఉద్యోగ సిబ్బంది పాల్గొన్నారు. 

 బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు

 పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్స వాలకు ఆలయ అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యా రు. స్వామివారి సేవలో వినియోగించే పీటలకు తెల్ల రంగు లు వేశారు. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో నిర్వహించే శ్రీపుష్పయాగంతో పాటు ఇతర హోమాలు చేసేందుకు హోమగుండాన్ని సిద్ధం చేశారు. 

తిరుమంజన మహోత్సవ ప్రత్యేకత

 అధ్యయనోత్సవాల్లో భాగంగా శ్రీవారి ఆలయంలో మూలవరులకు ఆగమ శాస్ర్తానుసారంగా తిరుమంజన మహోత్సవం నిర్వహిస్తారు. భగవత్‌ రామానుజాల వా రు ఈ వేడుకలను నిర్వహించుటలోని ప్రత్యేకతను సూచి స్తూ భగవానుడి భక్త పారాయణతను ఆర్తట్రాణ రక్షణను పలు విధాలుగా ప్రస్తుతిస్తారు. స్నపన తిరుమంజన మ హోత్సవంలో ఆళ్వారులకు, భగవానుడికి ఉత్సవ మూల వరులకు నిర్వహిస్తారు. ఈ వేడుక స్వామి వారికి పరమ ప్రీతికరమైనని దివ్యదేశికవైభవ ప్రకాశికలో పేర్కొన్నారు. 

VIDEOS

logo