శనివారం 27 ఫిబ్రవరి 2021
Yadadri - Dec 16, 2020 , 00:18:04

వాసాలమర్రిలో ‘ఇంటింటా సర్వే’

వాసాలమర్రిలో ‘ఇంటింటా సర్వే’

తుర్కపల్లి : సీఎం కేసీఆర్‌ దత్తతా గ్రామమైన వాసాలమర్రిలో మంగళవారం వ్యవసాయశాఖ అధికారులు ఇంటింటా సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని 10 వార్డుల్లో వ్యవసాయానికి సంబంధించిన సమాచారాన్ని రైతుల నుంచి సేకరించారు. రైతులు తమ వ్యవసాయ క్షేత్రాల్లో ఎన్ని ఎకరాలలో ఎంత పండిస్తున్నారు, పండించిన పంటలను ఎక్కడ అమ్ముతున్నారు, ఆహారపదార్థాలను ఎక్కడ కొనుగోలు చేస్తున్నారో తదితర వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వ్యవసాయాధికారి దుర్గేశ్వరి మాట్లాడుతూ.. రైతులు తమ వ్యవసాయ క్షేత్రాల నుంచి మట్టినమూనాలను సేకరించి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్న ఏఈవోలకు అందించాలని సూచించారు. కార్యక్రమంలో ఏఈవోలు పాల్గొన్నారు.

VIDEOS

logo