హైదరాబాద్ : ఎన్నికల కోడ్(Election Code) ఉల్లంఘించిన అధికారిపై వేటుపడింది. కోడ్ ఉల్లంఘించిన సైదాబాద్ ఏఎస్ఐ(Saidabad ASI) ఉమాదేవిని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి(CP Srinivas Reddy) సస్పెండ్(Suspended) చేశారు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి మాధవీలత ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలో ఏఎస్ఐ ఉమాదేవి మాధవీలతను ఆలింగనం చేసుకున్నారు. దీంతో ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ సంఘటనపై విచారించిన సీపీ ఉమాదేవిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.