శుక్రవారం 22 జనవరి 2021
Yadadri - Dec 05, 2020 , 00:21:35

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

  • గొర్రెలకు నట్టల నివారణ మందులు వేయడం హర్షణీయం..

తుర్కపల్లి : గొర్రెలు, మేకలకు సీజనల్‌గా సోకే వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని పల్లెపహాడ్‌ సర్పంచ్‌ సోక్కుల మోహన్‌రెడ్డి అన్నారు. పశుసంవర్థకశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం మండలంలోని వీరారెడ్డిపల్లి, గొల్లగూడెం, పల్లెపహాడ్‌ గ్రామాల్లో పశువైద్య సిబ్బంది గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం పశుసంవర్థకశాఖ ఆధ్వర్యంలో ఉచితంగా మందులతోపాటు అనేక సబ్సిడీలను అందిస్తుందన్నారు. వీటన్నింటిని గొర్రెల కాపరులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆయా గ్రామాల్లో 4,197 గొర్రెలు, 1332 మేకలకు నట్టల మందులు వేశామని పశువైద్యాధికారి కె.శ్రీనివాస్‌రావు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ మోహన్‌బాబు, గొర్రెల కాపరులు మల్లేశ్‌, రాఘవేందర్‌, శేఖర్‌ తదితరులు ఉన్నారు.

ఆత్మకూరు(ఎం) : గొర్రెలు ఆరోగ్యంగా ఉండేందుకు ప్రభుత్వం ఉచితంగా నట్టల నివారణ మందులు పంపిణీ చేయడం హర్షణీయమని మండలంలోని తుక్కాపురం సర్పంచ్‌ దయ్యాల రాజు అన్నారు. శుక్రవారం గ్రామంలోని గొర్రెల కాపర్లకు చెందిన గొర్రెలకు నట్టల నివారణ మందులు వేశారు. కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి సంతోశ్‌కుమార్‌, గోపాలమిత్ర సురేందర్‌, గొర్రెల కాపర్లు పాల్గొన్నారు.


logo