సోమవారం 18 జనవరి 2021
Yadadri - Dec 04, 2020 , 00:22:23

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

  • వైస్‌ ఎంపీపీ నాగటి ఉపేందర్‌

రామన్నపేట: గొర్రెలు, మేకలకు వచ్చే సీజనల్‌ వ్యాధుల పట్ల పెంపకందారులు అప్రమత్తంగా ఉండాలని వైస్‌ ఎంపీపీ నాగటి ఉపేందర్‌, స్థానిక సర్పంచ్‌ ముత్యాల సుజాత  అన్నారు. మండలంలోని నీర్నెంములలో గురువారం  మూగజీవాలకు  నట్టల నివారణ మందు తాపించారు.  ఈకార్యక్రమంలో పశువైద్యాధికారి శ్రీధర్‌రెడ్డి, వీఆర్‌వో యాదయ్య, చల్లా సత్యప్రకాశ్‌, గోపాల మిత్రలు సురేశ్‌, మల్లేశ్‌, ఆవుల యాదగిరి పాల్గొన్నారు.

నట్టల నివారణ మందులు వేయించాలి  

అడ్డగూడూరు:   గొర్రెలు,మేకలకు తప్పకుండా నట్టల నివారణ మందులు వేయించాలని మండల పశువైద్యాధికారి అశోక్‌కుమర్‌ అన్నారు. మండలంలోని బొడ్డుగూడెంలో  మేకలు,గొర్రెలకు   నట్టల నివారణ మందులు వేశారు. కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు లింగయ్య, సిబ్బంది సోమయ్య,గోపాలమిత్ర సతీశ్‌,రైతులు పాల్గొన్నారు.

బీబీనగర్‌లో...

బీబీనగర్‌: మండలంలోని నెమురగొముల, రాయరావుపేట్‌, మీదితండాల్లో జీవాలకు నట్టల నివారణ మందు పశువైద్యాధికారి ఉష తాపించారు. గొర్లకాపరుల సంఘం మండల అధ్యక్షుడు రమేశ్‌,  సిబ్బంది బుచ్చయ్య, శ్రీశైలం, మల్లేశ్‌ పాల్గొన్నారు.

వలిగొండలో...

వలిగొండ: మూగ జీవాలకు సీజనల్‌ వ్యాధుల సోకకుండా నట్టల నివారణ మందు వేయించాలని  మండల పశువైద్యాధికారి డాక్టర్‌ రాంమోహన్‌రెడ్డి అన్నారు.  మండలంలోని మల్లేపల్లి, గుర్నాథ్‌పలి, చిత్తాపురం, కంచనపల్లి, టేకులసోమారం గ్రామాల్లోని గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులు వేశారు. ఈ కార్యక్రమంలో రైతులు, గొర్రెల కాపర్లు, పశువైద్య సిబ్బంది  పాల్గొన్నారు.