గురువారం 25 ఫిబ్రవరి 2021
Yadadri - Dec 04, 2020 , 00:22:25

కేంద్ర ప్రభుత్వంపై నిరసనల వెల్లువ

కేంద్ర ప్రభుత్వంపై నిరసనల వెల్లువ

  • పెద్ద ఎత్తున రాస్తారోకోలు 

బీబీనగర్‌:  రైతులపై కేంద్ర ప్రభుత్వం దాడులు చేయించడం  సిగ్గుచేటని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కోమటిరెడ్డి చంద్రారెడ్డి అన్నారు.  కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా గురువారం మండల కేంద్రంలో సీపీఎం, సీఐటీయూ, కార్మిక సంఘాల నాయకుల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్‌ వ్యవసాయాన్ని తీసుకువస్తోందని, దీంతో సన్నకారు రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుందన్నారు.  ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్‌ బండారు శ్రీరాములు, నాయకులు టంటం వెంకటేశ్‌, రేసు రామచంద్రారెడ్డి, ఎరుకలి భిక్షపతి, రమేశ్‌ నాయక్‌, బండారు శ్రవణ్‌, గాడి శ్రీనివాస్‌, కందాడి దేవేందర్‌రెడ్డి పాల్గొనారు.

భువనగిరిలో...

భువనగిరి అర్బన్‌: కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన రైతు వ్యతిరేక ఆర్డినెన్స్‌లను ఉపసంహరించుకోవాలని కోరుతూ సీఐటీయూ, ఏఐడబ్ల్యూ, రైతు సంఘం, ఎస్‌ఎఫ్‌ఐ, ఐద్వా, జీఎంపీఎస్‌, కేవీపీఎస్‌ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పట్టణంలోని బాబుజగ్జీవన్‌రావ్‌ చౌరస్తాలో  రాస్తారోకో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు బట్టుపల్లి అనురాధ, నర్సింహ, వనం రాజు, కృష్ణ, జిట్ట అంజిరెడ్డి, విష్ణు, ఎల్లయ్య, కొండమడుగు నాగమణి, జ్యోతి, శైలజ పాల్గొన్నారు.

 రైతు వ్యతిరేక బిల్లులను ఉపసంహరించుకోవాలి 

అడ్డగూడూరు:  రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని మండల కేంద్రంలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయకార్యదర్శి బుర్ర అనిల్‌కుమార్‌ మాట్లాడారు.  కార్యక్రమంలో శాంతకుమార్‌, విజయ్‌, గురునాథ్‌, అనిల్‌, మదన్‌, నరేశ్‌ పాల్గొన్నారు. 

వలిగొండలో..

వలిగొండ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను  వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్‌ డిమాండ్‌ చేశారు.  మండల కేంద్రంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రైతులతో కలిసి చిట్యాల భువనగిరి ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించి కేంద్ర ప్రభుత్వ  దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండమడుగు నర్సింహ, గీత కార్మిక సంఘ రాష్ట్ర అధ్యక్షుడు మాటూరి బాలరాజు,  సీపీఎం మండల కార్యదర్శి మద్దెల రాజయ్య, సిర్పంగి స్వామి, కొమ్మిడి లక్ష్మారెడ్డి, తుర్కపల్లి సురేందర్‌, కూర శ్రీనివాస్‌, కల్కూరి రాంచందర్‌, ఏలె కృష్ణ, ముత్యాలు పాల్గొన్నారు.

రామన్నపేటలో.. 

రామన్నపేట: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని సీపీఎం జిల్లాకార్యదర్శి ఎండీ జహంగీర్‌ అన్నారు.  మండల కేంద్రంలోని చిట్యాల- భువనగిరి రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండమడుగు నర్సింహ , రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్‌రెడ్డి, నాయకులు మాటూరి బాలరాఆజు, జెల్లెల పెంటయ్య, నాగటి ఉపేందర్‌, బొడ్డుపల్లి వెంకటేశ్‌, మామిడి వెంకట్‌రెడ్డి, కల్లూరి నగేశ్‌, యాదాసు యాదయ్య, గన్నెబోయిన విజయభాస్కర్‌ పాల్గొన్నారు.

VIDEOS

logo