ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Yadadri - Aug 18, 2020 , 23:25:14

హనుమంతుడికి ప్రత్యేక పూజలు

హనుమంతుడికి ప్రత్యేక పూజలు

యాదాద్రి,నమస్తేతెలంగాణ: యాదాద్రీశుడి ఆలయ సన్నిధిలోని విష్ణుపుష్కరిణి చెంతన వెలసిన క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. హనుమంతుడి ఆరాధిస్తూ ఘనంగా ఆకుపూజ చేశారు. ఆంజనేయుడిని సింధూరంతో అలంకరించి అభిషేకించారు. తమలపాకులు సమర్పించి అర్చనలు చేశారు. స్వామివారికి శ్రీ చందనంతో  అభిషేకం చేశారు. శ్రవణానందంగా లలితాపారాయణం చేశారు. హనుమంతుడికి  ప్రీతిపాత్రమైన వడలు, బెల్లం, ఫలాలను నైవేద్యంగా సమర్పించారు. 

బాలాలయంలో శ్రావణ సందడి.. 

యాదాద్రి లక్ష్మీనరసింహుడి క్షేత్రంలోని బాలాలయంలో ఉత్సవ మూర్తులకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. పట్టు వస్ర్తాలు ధరింపజేసి పలు రకాల పుష్పాలతో అలంకరించారు. వేదమంత్రోచ్ఛరణతో సుదర్శన హోమం చేశారు. సుదర్శన అళ్వారును కొలుస్తూ హోమం నిర్వహించారు. నిత్యకల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉత్సవమూర్తులను అందంగా అలంకరించి  కనుల పండువగా కల్యాణం చేశా రు. దేవేరులను చూడముచ్చటగా ముస్తా బు చేసి గజవాహనంపై ముఖమండపంలోనే ఊరేగించారు. అష్టోత్తర పూజలు   అంగరంగ వైభవంగా నిర్వహించారు.

యాదాద్రీశుడికి రూ. 3.80 లక్షల ఆదాయం

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మంగళవారం రూ. 3,80,882 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రసాద విక్రయాల ద్వారా రూ.3,54,850, కొబ్బరికాయల ద్వారా రూ. 15,000, వాహనపూజల ద్వారా రూ. 3,900, చెక్‌పోస్ట్‌ ద్వారా రూ.. 2050, ప్రచార శాఖ ద్వారా రూ. 1375, మినీబస్సు ద్వారా రూ.1070,  అన్నదాన విరాళం ద్వారా రూ. 2,637 వచ్చినట్లు పేర్కొన్నారు. 


VIDEOS

logo