గురువారం 28 జనవరి 2021
Yadadri - Aug 18, 2020 , 23:25:15

మట్టి విగ్రహలే మేలు

మట్టి విగ్రహలే మేలు

  •  ఇండ్లల్లోనే పూజలు నిర్వహించాలి 
  •  కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ 

భువనగిరి కలెక్టరేట్‌ : కరోనా విజృంభిస్తున్న వేళ వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహించకుండా ఎవరికివారు ఇండ్లల్లోనే విగ్రహాలు పెట్టి పూజలు నిర్వహించుకోవాలని కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ సూచించారు. పర్యావరణానికి మేలు చేసే మట్టి విగ్రహాలనే ప్రతిష్ఠించాలన్నారు. మంగళవారం గాంధీ గ్లోబల్‌ సంస్థ అందజేసిన మట్టి విగ్రహాలను కలెక్టర్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాలే శ్రేయస్కకరమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి  ప్రభాకర్‌, భువనగిరి పట్టణ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు నర్సింహచారి, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


logo