చూడచక్కగా చిట్టడవి

చౌటుప్పల్ : జాతీయరహదారిపై లక్కారంలో ఏర్పాటు చేసిన యాదాద్రి మోడల్ నేచురల్ ఫారెస్ట్ దేశానికే తలమానికంగా మారిందని అటవీశాఖ ముఖ్యకార్యదర్శి శాంతికుమారి తెలిపారు. లక్కారం తంగేడువనం, ఫారెస్ట్ బ్లాక్ వన్ను బుధవారం కలెక్టర్ అనితారామచంద్రన్, అదనపు పీసీసీఎఫ్ చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి ఆమె సందర్శించారు.తంగేడువనంలోని యాదాద్రి మోడల్ నేచురల్ ఫారెస్ట్‌ను సందర్శించి మొక్కలను పరిశీలి ంచారు. అక్కడ దట్టంగా పెరిగిన మొక్కలు,పక్షులను చూసి అబ్బురపడ్డారు. కేవలం రెండేండ్ల వ్యవధిలో ఇంతచక్కటి చిట్టడవిని పెంచడం అభినందనీయమన్నారు.బటర్‌ఫ్లై పార్క్‌ను సందర్శించి కనుమరుగైన సీతాకోకచిలుకలు తిరిగి పార్క్‌లో కనువిందు చేయడం చూసి మురిసిపోయారు. అనంతరం అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చెరువు కుంటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె విలేరులతో మాట్లాడుతూ జిల్లా అటవీశాఖ అధికారులు చిట్టడవిని పెంచి రాష్ర్టానికే ఆదర్శంగా మారారని తెలిపారు. సీఎం కేసీఆర్ ఈ చిట్టడవిని చూసి అభినందించారని, ఆయనే స్వయంగా దీనికి యాదాద్రి మోడల్ నేచురల్ పార్క్ అని నామకరణం చేశారని గుర్తుచేశారు. అన్ని పట్టణాల్లో ఇలాంటి చిట్టి ఫారెస్టులను అభివృద్ధి చేయాలని భావిస్తున్నామన్నారు. యాదాద్రి మోడల్ పార్క్‌ను అభివృద్ధి చేసిన కలెక్టర్ అనితారామచంద్రన్, ఫారెస్ట్ సిబ్బందిని శాంతికుమారి అభినందించారు. ఆమె వెంట డీఎఫ్‌వో వెంకటేశ్వర్‌రెడ్డి, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సర్వేశ్వర్, డిప్యూటీ ఎఫ్ఆర్వో వెంకట్రాములు ఉన్నారు.
తాజావార్తలు
- బెంగాల్ సీఎం మమతతో భేటీ కానున్న తేజస్వి
- కామాఖ్య ఆలయాన్ని దర్శించిన ప్రియాంకా గాంధీ
- ఒక్క సంఘటనతో పరువు మొత్తం పోగొట్టుకున్న యూట్యూబ్ స్టార్
- ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం
- నాలుగో టెస్ట్‌కూ అదే పిచ్ ఇవ్వండి
- ఆప్‌లో చేరిన అందగత్తె మాన్సీ సెహగల్
- తాటి ముంజ తిన్న రాహుల్ గాంధీ..
- కేంద్ర హోంమంత్రి అమిత్ షా తిరుపతి పర్యటన రద్దు
- వెండితెరపై సందడి చేయనున్న బీజేపీ ఎమ్మేల్యే..!
- కేంద్రానికి తమిళ సంస్కృతిపై గౌరవం లేదు: రాహుల్‌గాంధీ