మంగళవారం 02 మార్చి 2021
Yadadri - Jul 29, 2020 , 01:08:46

సీఎం రిలీఫ్‌ఫండ్‌ పేదలకు వరం

సీఎం రిలీఫ్‌ఫండ్‌ పేదలకు వరం

ఆలేరు : సీఎం రిలీఫ్‌ఫండ్‌ పేదలకు వరంలాంటిదని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. బొమ్మలరామారం మండలం నాగినేనిపల్లి గ్రామానికి చెందిన గుజ్జ నర్సింహ, శోభ దంపతుల కుమారుడు మధుకు కొద్దిరోజుల కిందట చికిత్స నిర్వహించారు. దీంతో వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయనిధి నుంచి రూ.44,500 మంజూరైన చెక్కును మంగళవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో ప్రభుత్వ విప్‌ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పేదల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. ఆపదలో నగదు అందజేసి ఆదుకున్న సీఎం కేసీఆర్‌, ప్రభుత్వ విప్‌నకు లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాగినేనిపల్లి సర్పంచ్‌ బీరప్ప తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo