పరిసరాల పరిశుభ్రతను సామాజిక బాధ్యతగా చేపట్టాలి

- కొనసాగుతున్న పారిశుధ్య కార్యక్రమాలు
- గుట్టలోపనులను పరిశీలించిన అదనపు కలెక్టర్ కీమ్యానాయక్
రామన్నపేట : ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతను సామాజిక బాధ్యతగా చేపట్టాలని వివిధ గ్రామాల సర్పంచులు తెలిపారు. గురువారం ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాల్లో భాగంగా మండలవ్యాప్తంగా పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించారు.మండలకేంద్రంతో పాటు కక్కిరేణిలో మురుగు కాల్వల్లో బ్లీచింగ్ పౌడర్‌ను చల్లించారు. దుబ్బాకలో మురుగు కాల్వలను శుభ్రం చేయించారు. చెత్తను ట్రాక్టర్ సహాయంతో డంపింగ్ యార్డుకు తరలించారు. ఇంద్రపాలనగరంలో సర్పంచ్ కాటేపల్లి సిద్దమ్మయాదయ్య పారిశుధ్య కార్మికులతో కలిసి కలుపు మొక్కలను తొలగించారు. వివిధ గ్రామాల సర్పంచులు గోదాసు శిరీషాపృథ్వీరాజ్, నీల జయలక్ష్మీదయాకర్, పిట్ట కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మోత్కూరు : ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రత్యేక పారిశుధ్య పనుల్లో ప్రజలు భాగస్వాములు కావాలని మున్సిపల్ చైర్పర్సన్ తిపిరెడ్డి సావిత్రామేఘారెడ్డి అన్నారు. గురువారం మోత్కూరు మున్సిపాలిటీలోని అంబేద్కర్ చౌరస్తాలో డివైడర్‌లోని మొక్కల మధ్య ఉన్న కలుపు మొక్కలను తొలగింపజేశారు. అనంతరం ఆమె మాట్లాడారు. వానకాలంలో ప్రజలు ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడకుండా ముందస్తుగా ప్రభు త్వం గ్రామాల బాగు కోసం ప్రత్యేక పారిశుధ్య పనులను నిర్వహించడం చాలా బాగుందన్నా రు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బొల్లేపల్లి వెంకటయ్య, మున్సిపల్ కమిషనర్ పి. మనోహర్‌రెడ్డి, మేనేజర్ శంకరయ్య తది తరులు పాల్గొన్నారు.
సంస్థాన్‌నారాయణపురం : ప్రభుత్వం గ్రామాల్లో చేపడుతున్న ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు మండల వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. మండలకేంద్రంలో సర్పంచు సికిలమెట్ల శ్రీహరి పర్యవేక్షణలో మురుగు కాల్వలను శుభ్రం చేసిన అనంతరం బ్లీచింగ్ పౌడర్‌ను చల్లించారు. అలాగే మురుగు కాల్వలకు ఇరువైపులా పెరిగిన కలుపు మొక్కలను, చెత్తను తొలగించారు. వెంకంబావితండాలో పారిశుధ్య కార్మికులు మురుగు కాల్వలో బ్లీచింగ్ పౌడర్‌ను చల్లారు. జనగాం, పుట్టపాక, వాయిళ్లపలి, సర్వే ల్, గుడిమల్కాపురం, అల్లందేవిచెరువు, చిమిర్యాల గ్రామాల్లో మురుగు కాల్వలను శుభ్రం చేసిన అనంతరం దోమలు రాకుండా పారిశుధ్య కార్మికులతో బ్లీచింగ్ పౌడర్‌ను చల్లించారు. ఈ సందర్భంగా పలువురు సర్పంచులు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచించా రు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచులు, వార్డు సభ్యు లు, కోఆప్షన్ సభ్యులు తది తరులు పాల్గొన్నారు.
అడ్డగూడూరు : మండలకేంద్రంతో పాటు ధర్మారం, లక్ష్మీదేవికాల్వ, కంచనపల్లి, మాసాయికుంట, గట్టుస్గిరం, వెల్ధేవి, మానాయికుంట, కొండంపేట, డి. రేపాక, చౌళ్లరామారం, చిర్రగూడూరు , జానకిపురం, చిన్నపడిశాల గ్రామాల్లో పల్లెప్రగతి పనులు కొనసాగుతున్నాయి. గ్రామాల్లోని వీధుల్లో చెత్తను, కలుపు మొక్కలను, మురుగు కాల్వలను శభ్రపరుస్తున్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఆ టైంలో అందరూ భయపెట్టారు: అమలా పాల్
- ఖాదర్‌బాషా దర్గాను సందర్శించిన హోంమంత్రి
- హిందీ జర్నలిస్ట్స్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ
- యాదాద్రి ఆలయ నిర్మాణ పనుల పరిశీలన
- ఆస్తి పన్ను పెంపు దారుణం : చంద్రబాబు
- స్మృతి మందాన@6
- ‘నాంది’ 11 రోజుల కలెక్షన్స్ ఎంతంటే..
- వామన్‌రావు దంపతుల హత్య బాధ కలిగించింది : కేటీఆర్
- 18 ఏళ్లకే ముద్దు పెట్టేశా.. ఓపెన్ అయిన స్టార్ హీరోయిన్
- కందకుర్తి సరిహద్దులో ఇంజక్షన్ కలకలం