బుధవారం 24 ఫిబ్రవరి 2021
Yadadri - Feb 02, 2020 , 23:08:31

రైతు పథకాలను ప్రచారం చేయాలి

రైతు పథకాలను ప్రచారం చేయాలి

ఆత్మకూరు(ఎం): దేశంలో ఎక్కడా లేనివిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమలు చేస్తున్న పథకాల పై ప్రచారం చేసి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎన్నికల్లో డైరెక్టర్లతో పాటు చైర్మన్‌ స్థానాలను  కైవసం చేసుకోవాలని టీఆర్‌ఎస్‌ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని పీఎస్‌ గార్డెన్‌లో జరిగిన టీఆర్‌ఎస్‌ మండల నాయకుల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు.  రైతు బంధు, రైతు బీమా, సకాలంలో ఎరువులు, విత్తనాలను అందిస్తూ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందన్నారు. ప్రతి గ్రామం పచ్చని పంటలతో కళకళలాడే విధంగా ఉండేందుకు మిషన్‌ కాకతీయ ద్వారా చెరువులను అభివృద్ధి చేయడంతో పాటు బిక్కేరు వాగుల పై చెక్‌డ్యాంల నిర్మాణం చేపట్టిందన్నారు. మండలానికి సాగు నీరును అందించే బునాదిగాని కాలువ నిర్మాణం కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు.  త్వరలో కాలువ పనులను పూర్తి చేసి సాగు నీరు అందివ్వనున్నట్లు తెలిపారు.


 అదేవిధంగా రైతుల సంక్షేమం కోసం 5వేల జనాభాకు ఒకరు చొప్పున మండల వ్యవసాయ అధికారులను నియమించిందన్నారు. మద్ధతు ధర కోసం వడ్ల కొనుగోలు కేంద్రాలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. సహకార సంఘంలో పార్టీ బలపర్చిన అభ్యర్థుల విజయంకోసం సమష్టిగా  కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో డీఎల్‌డీఏ చైర్మన్‌ మోతె పిచ్చిరెడ్డి, జిల్లా సహకార బ్యాంకు మాజీ అధ్యక్షుడు మోతె సోమిరెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వనం స్వాతి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు భాషబోయిన ఉప్పలయ్య, మోటకొండూరు జడ్పీటీసీ పల్ల వెంకట్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శులు పంజాల వెంకటేశ్‌, యాస రంగారెడ్డి, ఎంపీటీసీ యాసకవిత, మదర్‌ డెయిరీ డైరెక్టర్‌ మోతె పూలమ్మ, రైతు సమన్వయ సమితి మండల కో ఆర్డినేటర్‌ యాస ఇంద్రారెడ్డి, జిల్లా డైరెక్టర్లు కోరె భిక్షపతి, బీసు ధనలక్ష్మి, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్లు జయశ్రీ, శంకర్‌, టీఆర్‌ఎస్‌ జిల్లా, మండల నాయకులు బీసు చందర్‌గౌడ్‌, పూర్ణచందర్‌రాజు, అరుణ, మాజీ వైస్‌ ఎంపీపీలు రవీందర్‌రెడ్డి, కాలె మల్లేశం, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు లగ్గాని రమేశ్‌గౌడ్‌, రాజు, స్వామి, నాయకులు పాల్గొన్నారు.

VIDEOS

logo