దుగ్గొండి, ఏప్రిల్, 25: అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే గ్రామాల్లో అధికారులు సర్వే నిర్వహించి ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని జడ్పీ సీఈవో రామ్ రెడ్డి సిబ్బందికి సూచించారు. శుక్రవారం మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే తీరును పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 60 గజాలకు తక్కువగా ఉండకూడదని, గతంలో బేస్మెంట్, పిల్లర్స్ కట్టిన వారు అర్హులు కారని, ఇప్పుడు కొత్తగా ముగ్గులు పోసినవారే అర్హుల జాబితాలో ఉంటారని జెడ్పి సీఈవో లబ్ధిరులకు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధికారి లెక్కల అరుంధతి, పంచాయతీ కార్యదర్శి రాజేంద్రప్రసాద్, రాజేష్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.