కాశీబుగ్గ, డిసెంబర్24: వరంగల్ ఎనుమాముల వ్యవ సా య మార్కెట్ కమిటీ పరిధిలోని మిర్చి యార్డులో మంగళ వా రం జీరో కాంటాలు నిర్వహించారు. మిర్చి తూకం వేసే క్ర మం లో దడువాయి దగ్గర ఉండి జీరో కాంటా చేయడం గమనా ర్హం. కాగా సీజన్ ప్రారంభంలోనే ఇలా చేయడంతో మార్కెట్ ఆదాయానికి భారీగా గండి పడే అవకాశం ఉంది.
ఇంత జరుగు తున్నా యార్డు ఇన్చార్జిలు, సూపర్వైజర్లు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కాగా, మా ర్కెట్కు సుమారు 3 వేల మిర్చి బస్తాలు వచ్చినట్లు అధికారులు తెలిపా రు. మార్కెట్ ప్రధాన కార్యాలయంలో జేడీఎం శ్రీనివాస్, డీడీ ఎం పద్మావతి, కార్యదర్శి నిర్మల సిబ్బందితో మిర్చి సీజన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమావేశం నిర్వహించారు.