మొగుళ్ళపల్లి,మే18 : మతిస్థిమితం కోల్పోయిన యువకుడు బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన రామగిరి నవీన్ (36) గత 12 సం నుండి మతిస్థిమితం కోల్పోయి ఇంటివద్దనే ఉండేవాడు. శుక్రవారం ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు.
కుటుంబ సభ్యులు ఆచూకీ కోసం వెతుకుతుండగా మండల కేంద్రం శివారు పెద్ద వాగు ఒడ్డున ఉన్న గ్రామ పంచాయతీకి సంబధించిన బావిలో శవమై కనిపించాడు. తమ కుమారుడి మృతిపై ఎటువంటి అనుమానం లేదని మృతుడి తండ్రి రామగిరి సర్వేశం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ అశోక్ తెలిపారు.