నెక్కొండ, డిసెంబర్ 1: ఆన్లైన్ ప్రేమ విఫలమవడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన ఘ టన నెక్కొండ మండలం అప్పల్రావుపేట లో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. గ్రా మానికి చెందిన జిల్లా వినయ్(25) ఉపాధి కోసం హైదరాబాద్‌కు వెళ్లి ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు.
వినయ్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో చి త్తూరు జిల్లాకు చెందిన ఓ యువతితో ఏర్ప డిన పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. తను ప్రేమించిన యువతికి మరో వ్యక్తితో పె ళ్లి జరగడంతో మనస్తాపానికి గురైన వినయ్ హైదరాబాద్‌లో ఐదు రోజుల క్రితం క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిమ్స్‌లో చికిత్సపొందుతూ శనివా రం అర్ధరాత్రి మృతి చెందాడు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.