నర్సంపేట, జూన్ 15 : ప్రజలకు ఉచితాలు ఇవ్వకుండా విద్య, వైద్యం సక్రమంగా అందిస్తే ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తారని తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక డివిజన్ ఉపాధ్యక్షుడు ఏరుకొండ సదానందం అన్నారు. నర్సంపేట డివిజన్ కేంద్రంలో ఉద్యమకారుల ఐక్యవేదిక డివిజన్ స్థాయి సమావేశం ఏరుకొండ సదానందం అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఉద్యమకారుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు పంజాల వెంకట్ గౌడ్, ఉపాధ్యక్షులు భూపతి లక్ష్మీనారాయణ నేతృత్వంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో వివిధ పార్టీలు గెలుపు కోసం ఎన్నో రకాల హామీలు ఇస్తున్నారు. అవి అమలుపరిచే విధానంలో పూర్తిగా విఫలం చెందారన్నారు. ఉచిత పథకాల అమలులో విఫలమై ఆయా రాష్ట్రాల్లోని ప్రజలు ప్రభుత్వం ఇచ్చే ఉచితాల వైపు ఎదురుచూస్తూ వివిధ రంగాల్లోని ప్రజలందరూ తమకున్న నైపుణ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు పార్టీలకతీతంగా విద్య, వైద్యం సక్రమంగా అమలు చేస్తే దేశం పురోగతి చెందుతుందన్నారు.ఈ సమావేశంలో నీలా శ్రీధర్ రావు, సంగం మహేందర్, గవర్ సింగ్, టి అంజయ్య, ఓటు రమేష్, బి రాజశేఖర్, జె రవి. తదితరులు పాల్గొన్నారు.