గార్ల, మార్చి 2 : మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని పాకాల ఏరులో రాళ్లు తేలాయి. ఇప్పటికే నీరు లేక వెలవెలబోతున్నది. ఈ ఏరు పరీవాహక ప్రాంతంలో 300 ఎకరాల్లో యాసంగి వరి పంట సాగుచేస్తున్న రైతులు నీరు లేక ఎండిపోతున్న పంటను చూసి లబోదిబోమంటున్నారు.
శ్రీరాంసాగర్ కెనాల్ ద్వారా జలాలు విడుదల చేయాలని మొరపెట్టుకున్నా ఇరిగేషన్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పశు పక్ష్యాదులకూ నీరు దొరకని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా కాంగ్రెస్ పాలకులు, అధికారులు సాగు నీరందించాలని రైతులు కోరుతున్నారు.