కాజీపేట, మే 15: అసంఘటిత రంగాలలో పనిచేసే ప్రతి కార్మికుడు లేబర్ కార్డు కలిగి ఉండాలని షెడ్యూలు కులాల హక్కుల అభివృద్ధి సమితి కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు యమడాల హనుకాంత్ అన్నారు. కాజీపేట రైల్వే ఈఎల్ఎస్ పార్కులో గురువారం సాయంత్రం భవాని నిర్మాణ కార్మికులకు లేబర్ కార్డును ఆయన అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసంఘటిత కార్మిక రంగాలలో పనిచేసే ప్రతి కార్మికులకి లేబర్ కార్డు ఎంతగానో దోహదపడుతుందన్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ప్రతి కార్మికుడికి చేరేలా కృషి చేస్తానని ఆయన తెలిపారు. వేసవిలో కార్మికులు ఆరోగ్యాల పట్ల జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రతి కార్మికుడికి కష్టసుఖాల్లో అండగా ఉంటా అన్నారు. ఈ కార్యక్రమంలో సులోచన, సంధ్య, ప్రమీల, స్వప్న, స్రవంతి, తదితరులు పాల్గొన్నారు.