Mahadevapur | మహదేవపూర్, జూన్ 6 : మహాదేవపూర్ మండల తహసీల్దార్‌గా వై రామారావు శుక్రవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో బాధ్యతలను స్వీకరించారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు టేకుమట్ల మండలంలో తహసీల్దార్‌గా భాద్యతలు నిర్వర్తించి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో ఖమ్మం జిల్లా ముదిగొండలో తహసీల్దార్‌గా పని చేసి ఆయన బదిలీపై ఇక్కడికి వచ్చారు. నూతన తహసీల్దార్‌కు డిప్యూటీ తహసీల్దార్ కృష్ణ, రెవెన్యూ సిబ్బంది శాలువా కప్పి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, భూభారతి కంప్యూటర్ ఆపరేటర్ చెన్నూరి సాయి, కిషోర్, ఆసిఫా తదితరులు పాల్గొన్నారు.