నమస్తే నెట్వర్క్ మే 9 : భారత సైన్యానికి సంఘీభావంగా దేవాదాయ శాఖ ఆధ్వర్యం లో శుక్రవారం కాళేశ్వర-ముక్తీశ్వర ఆలయం లో అధికారులు, భక్తులు శుక్రవారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. భారత సైనికుల క్షేమం కోరుతూ హనుమకొండలోని చా రిత్రక వేయిస్తంభాల ఆలయంలో పూజలు చేశారు. ఎంతో ధైర్యంగా పోరాడుతున్న మన భారత సైన్యానికి ఆ భగవంతుడు మరింత శక్తిని ఇచ్చి విజయపథంలో నడిపించాలని, దేశం సుభిక్షంగా ఉండాలని ఉమ్మడి వరంగల్ జిల్లా సహాయ కమిషనర్ రాముల సునీ త, ఈవో అనిల్‌కుమార్, ఆల య ప్రధాన అర్చకులు గంగు ఉపేందర్‌శర్మ ఆకాంక్షించారు. మేడారంలో సమ్మక్క, సారలమ్మల పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. ఆపరేషన్ విజయవంతం కా వాలని కోరుతు సమ్మక్క,సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజుల గద్దెలపై పసుపు, కుం కుమ, నూతన వస్ర్తాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పాకిస్తాన్‌తో జరుగుతున్న యుద్ధంలో భారత్ విజయం సాధించాలని, టెర్రరిస్టులు అంతం కావాలని కోరుతూ రామప్ప, కురవి వీరభద్రస్వామి, కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయాల్లో పూజలు చేశారు. పాలకుర్తిలోని సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయం, బచ్చన్నపేట మండలం కొడవటూరు సిద్ధేశ్వరస్వామి ఆలయాల్లో అర్చకులు, దేవాదాయ శాఖ అధికారులు పూజలు నిర్వహించారు. భారత సైనికులకు మద్దతుగా చిట్యాల మండలకేంద్రంలోని కౌసర్ఏ మసీదులో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పాకిస్తాన్ డౌన్, డౌన్.. భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. న ర్సంపేటలో బీఆర్ఎస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కొవ్వొతులతో ర్యాలీ తీశారు. ఈ సం దర్భంగా భారత సైన్యానికి దేశ ప్రజలంతా అండగా నిలువాలని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నాగళ్లి వెంకటనారాయణగౌడ్ కోరారు.
గణపురం, మే 9 : కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రంలో శుక్రవారం నుంచి పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. నేషనల్ సెక్యూరిటీ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. విధులకు హాజరయ్యే ఉద్యోగులు, కార్మికులు, ఇతర సిబ్బందిని క్షుణ్ణంగా తనిఖీ చేసి ఐడీ కార్డును పరిశీలించాకే కేటీపీపీ మెయిన్ గేట్ నుంచి లోపలికి అనుమతిస్తున్నారు. గతంలో కేటీపీపీ సెక్యూరిటీ అధికారులే ఉద్యోగులను చెక్ చేసి పంపేవారు. తాజాగా ‘ఆపరేషన్ సిందూర్’ కొనసాగుతున్న క్రమంలో ముందుజాగ్రత్తగా భారీ బందోబస్తు ఏర్పాట్లుచేసినట్లు సమాచారం.
‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా పాకిస్తాన్‌తో వీరోచితంగా పోరాడుతున్న భారత సైన్యానికి కొండంత బలం ఇచ్చి.. యుద్ధంలో విజయం సిద్ధించాలని కాంక్షిస్తూ దేవుళ్లను వేడుకుంటున్నారు. పాక్ పన్నాగాలను తిప్పికొట్టే శక్తియుక్తులనివ్వాలంటూ శుక్రవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రముఖ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే పలుచోట్ల ‘ఆపరేషన్ సిందూర్’కు సంఘీభావంగా జాతీయ జెండాలు చేతబూని ర్యాలీలు తీశారు. ఈ సందర్భంగా భారత సైనికులారా.. మీ వెంటే మేముంటాం, అమర జవాన్లకు జోహార్లు.. జై భారత్ ! జై జై భారత్ ! హిందుస్థాన్ జిందాబాద్’ నినాదాలతో హోరెత్తించారు. బీఆర్ఎస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నర్సంపేటలోని అమరవీరుల స్తూపం వద్ద భారత ఆర్మీకి(ఆపరేషన్ సిందూర్) మద్దతుగా, పాకిస్తాన్ ఉగ్ర దాడుల్లో అమరులైన జవాన్ కుటుంబాలకు సంతాపం తెలుపుతూ కొవ్వొత్తులతో ర్యాలీలు నిర్వహించారు.
జనగామ రూరల్, మే 9 : భారతదేశం, పాకిస్థాన్ మధ్య జరిగిన యుద్ధాలు చరిత్రలో ఎంతో కీలకం. 1947లో విభజన అనంతరం ఏర్పడిన ఈ రెండు దేశాల మధ్య రాజకీయ, భౌగోళిక, మతపరమైన విభేదాలెన్నో యుద్ధాలకు దారితీశాయి. ప్రధానంగా 1947, 1965, 1971, 1999 (కార్గిల్ యుద్ధం) లో తలపడ్డాయి. నేను కశ్మీర్లో 3 సంవత్సరాలు పనిచేశా. అక్కడ ఉన్న పరిస్థితులు 2019 తర్వాత చాలా మరాయి. పాకిస్థాన్ ఎప్పుడూ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ, టూరిస్టులు, సైనికులపై కాల్పులు జరపడం.., భారత సైనికులు వారికి దీటుగా సమాధానం చెప్పడం చాలాసార్లు జరిగాయి. ఇలాంటి సమయంలో మనం శాంతి కోసం ఎదురు చూస్తూ ఉండలేం కదా.. పాకిస్థాన్‌కు సరైన జవాబు ఇచ్చి తీరాలి. నేను భారతదేశ సైనికుడిగా ఈగడ్డపై జన్మించిన ప్రతి పౌరుడిని రక్షించడం నా ధర్మం. దేశ సరిహద్దుల వద్ద నా సోదరులతో కలిసి నా దేశ భద్రతకు అంకితమవుతా. దేశ సైనికులకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలి. – కేమిడి చంద్రశేఖర్, సీఐఎస్ఎఫ్ సైనికుడు