మొగుళ్లపల్లి/చిట్యాల : మొగుళ్లపల్లి మండలంలోని కొరికిశాల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో సోమవారం కిచిడీలో పురుగులు రావడంతో 31మంది విద్యార్థినులు అస్వస్థతకు గుర య్యారు. కడుపునొప్పి, నీరసం, వాంతులతో ఆస్పత్రి పాలయ్యా రు. వివరాలిలా ఉన్నాయి.. బ్రేక్ ఫాస్ట్ కిచిడీ లో పురుగులు రావ డం వల్లే విద్యార్థులు వాంతులు చేసుకున్నట్లు తెలిసింది. స్థానిక ఏఎన్ఎంలతో ప్రా థమిక వైద్యం అందించినా వాంతులు ఆగకపోవడంతో పీహెచ్‌సీకి సమాచారం అందించారు.
మొగుళ్లపల్లి పీహెచ్సీలో 18 మందిని, తీవ్ర అస్వస్థతకు గురైన మిగతా 13 మంది విద్యార్థులను అంబు లెన్స్‌లో చిట్యాల మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందజే స్తు న్నారు. నిర్లక్ష్యంతో ఇంత మంది పిల్లలను ఆస్పత్రి పాలు చేసిన బాధ్యులైన వారిపై కఠిన చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, అదనపు కలెక్టర్ అశోక్ కుమా ర్ కేజీబీవీని సందర్శించారు.
ఈ సందర్బంగా విద్యార్థులు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొవచ్చారు. భోజనం సరిగా వండడం లేదని, తెల్ల పురుగులు వస్తున్నాయని ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశామని విద్యార్థులు వాపోయారు. దీంతో ఎమ్మెల్యే ప్రిన్సిపాల్‌పై ఆగ్రహం వ్యక్తం చేయగా డీఈవో తెలియపరిచానని చెప్పారు. తక్షణమే వంట సిబ్బందిని, బియ్యం నిల్వలను వెంటనే మార్చాలని అధికారులను ఆదేశించారు. బీఆర్ఎస్ నాయకులు, మాజీ జడ్పీటీసీ జోరుక సదయ్య, చిట్యాల వ్యవసాయ మారెట్ కమిటీ మాజీ చైర్మన్ కొడారి రమేశ్, పార్టీ మండల అధ్యక్షుడు బలుగురి తిరుపతి రావు విద్యార్థులను పరామర్శించారు.
గురుకులాల్లో ప్రభుత్వ పర్యవేక్షణ కరువైందని, రాష్ట్రంలో ఏదో ఒక చోట గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ అవుతున్నదని మండలి ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదన చారి అన్నారు. దవాఖాన చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్య ప రిస్థితులను ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించలని వైద్యులను ఆదేశించారు.
బాధ్యులను సస్పెండ్ చేసి శిక్షించాలని బీఆర్ఎస్ పార్టీ, చిట్యాల, మొగుళ్లపల్లి శాఖల ఆధ్వర్యంలో చిట్యాల దవాఖాన ఎదుట ధర్నా చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పోగొట్టుకునేలా ప్రభుత్వ పరిపాలన కొనసాగుతుందని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదించారు. రాష్ట్రంలో ఇన్ని పాఠశాలలో ఇంతమంది విద్యార్థులు రోడ్డెకుతున్న ప్రభుత్వ పనితీరు ఎందుకు మారడం లేదని ఆయా మండలా పార్టీ అధ్యక్షులు అల్లం రవీందర్, బల్గూరి తిరుపతిరావు ప్రశ్నించారు. కార్యక్రమంలో కొడా రి రమేశ్, చిట్యాల వరింగ్ ప్రెసిడెంట్ పిట్ట సురేశ్, నాయకులు పాండ్రాల వీరస్వామి, పెరుమాండ్ల రవీందర్ గౌడ్, ఏలేటి రాజు, మేడిపల్లి శ్రీను, శ్రీదేవి, సరోజన, కల్వచల రాము, తిరుమల రమణాచారి, బీఆర్ఎ స్వీ, స్వేరో విద్యార్థి నాయకులు ఉన్నారు.
పొద్దున చేసిన టిఫిన్ చేసి మంచిగనే ఉన్న. కొద్దిసేపటి తర్వాత తల తిరుగుడు మొదలుపెట్టింది. ఓకారం వచ్చినట్లు అ య్యింది. నాకు శ్వాస ఇబ్బందనిపిచ్చి మా మేడంకి చెప్పిన. వెంటనే దవాఖానకు తీసుకొచ్చిండ్లు. వంట మనుషులు నిర్లక్ష్యం చేస్తున్నరు. వారిపై చర్యలు తీసుకోవాలి.
– నందిని, విద్యార్థిని పిల్లల ఆరోగ్యం పట్టదా?
నమ్మకంతో పాఠశాలకు పంపించాం. చదువెట్లున్న ఆరోగ్యం ముఖ్యం. పిల్లలతో ఇంత చెలగాటం ఆడుతున్న వారిపట్ల ప్రభుత్వ పట్టింపేది? ఇటీవలే మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాఠ శాలను సందర్శించి లోపాలను చూపెట్టినా కూడా ఎందుకు సవరించుకోలేదని ఎమ్మెల్యేని అడిగిన. పిల్లలకు జరగరానిది ఏదైనా జరిగితే బాధ్యులు ఎవరని ప్రశ్నించిన. వెంటనే కారకులపై చర్యలు తీసుకోకపోతే పిల్లలను బడికి పంపం.
– కొల్లూరి మమత, విద్యార్థిని తల్లి