హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 14 : కేయూలోని పద్మాక్షి గర్ల్స్ హాస్టల్లో భోజనంలో పురుగులు వచ్చాయి. శుక్రవారం రాత్రి భోజనం చేస్తున్న విద్యార్థినులకు ఆలు కర్రీ, సాంబార్లో పురుగులు కనిపించడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్ డైరెక్టర్, అధికారులు పట్టించుకోకపోవడంతో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
మూడు రోజుల క్రితం బాయ్స్ కామన్ మెస్‌లో నాణ్యమైన ఆహారాన్ని అందించడం లేదని ఆందోళన చేశారు. వారం క్రితం ఇదే మెస్‌లో సీనియర్లు, జూనియర్లు కొట్టుకున్నారు. శుక్రవారం ఉదయం టిఫిన్స్ కోసం విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. వరుస ఘటనల నేపథ్యంలో యూనివర్సిటీలోని మెస్‌లు పోలీసు బందోబస్తు మధ్య నిర్వహిస్తున్నారు. శుక్రవా రం రాత్రి కర్రీ, సాంబార్లో పురుగులు రావడం, మహిళా పోలీసులు బందోబస్తు ఉండడంతో విద్యార్థినులు సైలెంట్‌గా ఉండిపోయారు.