ఏటూరునాగారం/ ములుగు రూరల్, ఆగస్టు 9 : ఆదివాసీల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తూ గిరిజన చట్టాలను అమలు చేస్తామని కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. ఏటూరునాగారం ఐటీడీఏ ఆధ్వర్యంలో శుక్రవారం అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత బస్టాండ్ నుంచి ఐటీడీఏ వరకు ర్యాలీ తీసి కుమ్రంభీం విగ్రహానికి కలెక్టర్ దివాకర, పీవో చిత్రామిశ్రా, ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, ఆదివాసీ సంఘాల నాయకులు పూలమాలలు వేసి తుడుందెబ్బ జెండాను ఆవిష్కరించారు. అలాగే ములుగులో ఆదివాసీ ఉద్యోగుల ఆధ్వర్యంలో గిరిజన భవన్లో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల సమావేశాల్లో కలెక్టర్ మాట్లాడారు.
గిరిజనులు తమ సంప్రదాయాలను కాపాడుకుంటూ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని కోరారు. తాను చదువుకునే రోజుల్లో ఆదివాసీల చట్టాలను పూర్తిగా తెలుసుకున్నానని పేర్కొన్నారు. ఐటీడీఏ ద్వారా వంద శాతం పథకాలను అమలు చేస్తామన్నారు. పీవో చిత్రామిశ్రా మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లోని సమస్యలను తెలుసుకుంటూ పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. నెల రోజుల్లో జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. చట్టాలను అమలు చేయాలని, ఆదివాసీల అభివృద్ధికి పాటు పడాలని ఆదివాసీ నాయకులు కోరారు. ఈ సందర్భంగా విద్యార్థులు నృత్య ప్రదర్శనలు చేయగా కలెక్టర్, పీవో విద్యార్థులతో కలిసి స్టెప్పులేసి ఉత్సాహపర్చారు.
వేడుకల్లో డీడీ పోచం, ఏవో రాంబా బు, ఎస్వో రాజ్‌కుమార్, ఆర్డీవో కే సత్యపాల్‌రెడ్డి, ఈఈ వీరభద్రం, సీఐ శ్రీనివాస్, ఎస్సై తాజుద్దీన్, పెసా కో ఆర్డినేటర్ ప్రభాకర్, తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు వట్టం ఉపేందర్, జిల్లా అధ్యక్షులు, నాయకులు, ఆదివాసీ సం ఘాల ప్రతినిధులు గొప్ప వీరయ్య, మైపతి అరుణ్, మైప తి సంతోష్, పొడెం బాబు, పొడెం రత్నం, కొప్పుల రవి, పులిశె బాలకృష్ణ, చింత కృష్ణ, పొదెం కృష్ణప్రసాద్, కోట నర్సింహులు, పొడెం శోభన్, ఈసం రామ్మూర్తి, చేల బా బారావు, పెనక ప్రభాకర్, కబ్బాక శ్రావణ్, మహిళా సం ఘాల ప్రతినిధులు సరిత, శమంతకమణి పాల్గొన్నారు.