పర్వతగిరి, జూన్ 1: వరంగల్ జిల్లాలోని పర్వతగిరి (Parvathagiri) మండలం జమాల్పురంలో తాటిచెట్టు పైనుంచి పడి ఓ గీత కార్మికుడు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం ఉదయం గ్రామానికి చెందిన గీత కార్మికుడు దుడ్డు సంపత్ వృత్తిలో భాగంగా తాటిచెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు కింద జారిపడిపోయారు. దీంతో ఆయన కాలు, నడుము విరిగిపోయాయి. స్థానికులు ఆయనను దవాఖానకు తరలించారు.
బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని జమాలపురం గీత పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు బాల్య మల్లేశం గౌడ్, తెలంగాణ గౌడ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బాల్య వెంకట్ రాజ్ గౌడ్, కారింగుల అరవింద్ గౌడ్, దుడ్డు నాగరాజు గౌడ్ డిమాండ్ చేశారు. .