కరీమాబాద్, సెప్టెంబర్ 11 : తెలంగాణ సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే సంక్షేమం తో పాటు అభివృద్ధి సాధ్యమని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఫోర్టు రోడ్డులోని క్యాంపు కార్యాలయంలో 41వ డివిజన్ నుంచి కార్పొరేటర్ పోశాల పద్మ-స్వామి గౌ డ్ ఆధ్వర్యంలో సోమవారం పలు పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు ఎమ్మెల్యే నన్నపునేని సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణలోని కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, చేపడుతున్న సంక్షేమ పథకాలను చూసి, ప్రజలు బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. మరోసారి తెలంగాణలో ఎగిరేది గులాబీ జెండానే అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్కు ఎదురులేదన్నారు. పార్టీని నమ్ముకుని వచ్చిన వారికి అండగా ఉంటామన్నారు. పార్టీ కోసం పని చేసే వారికి సముచిత స్థానం ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో, మంత్రి కేటీఆర్ అండదండలతో నియోజకవర్గ అభివృద్ధ్దికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే రూ.కోట్లతో అభివృద్ధ్ది పనులను చేపట్టామన్నారు. భవిష్యత్‌లో మరిన్ని పనులు చేపడుతామన్నారు. బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి అందరం కలిసి కృషి చేయాలన్నారు. కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్నే ప్రజలు కోరుకుంటున్నారన్నారు. కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి సంక్షేమం కోసం కృషి చేస్తానని చెప్పారు. కేసీఆర్‌తోనే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో నాయకులు గుడిమెల్ల రాజు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
హనుమాన్‌నగర్ అభివృద్ధికి కృషి
హనుమాన్‌నగర్ కాలనీ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. సాకరాశికుంటను హనుమాన్‌నగర్ కాలనీగా మా రుస్తూ ఏర్పాటు చేసిన బోర్డును కార్పొరేటర్ సిద్దం రాజుతో కలసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ముంపు ప్రాంతమైన హనుమాన్‌నగర్ కాలనీని అభివృద్ధి, ముంపు లేకుండా చర్యలు చేపడతానన్నారు. అనంతరం విశ్వకర్మ అభివృద్ధి సహకార సంఘం కమ్యూనిటీ హాల్‌కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నన్నపునేనిని కాలనీ వాసులు సత్కరించారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు బోరిగం నర్సింగం, నాయకులు ముష్కమల్ల సుధాకర్, బత్తుల కిషన్, మండ శ్యాం, ఎలగొండ రవి పాల్గొన్నారు.
మైనార్టీలకు బీఆర్ఎస్ సర్కారు పెద్ద పీట
ముస్లిం మైనార్టీలకు బీఆర్ఎస్ సర్కారు పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఆదివారం రాత్రి గ్రేటర్ 37వ డివిజన్లోని మైనార్టీ కాలనీలో ఆయన పర్యటించారు. అనంతరం కాలనీ పెద్దలతో సమావేశమై మాట్లాడారు. సంక్షేమ పథకాలలో మైనార్టీలకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. దేశాయిపేటలో రూ.10కోట్లతో మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల, రూ.4.70 కోట్లతో షాదీఖాన, ప్రస్తుతం రూ.8.5కోట్లతో ఈద్గాలు, మసీ దు పనులు జరుగుతున్నాయన్నారు. ఖిలావరంగల్, గిర్మాజీపేట ప్రాంతాల్లో అషూర్ఖాన కట్టించినట్లు చెప్పారు. కోటలో మరో అషూర్ఖానకు శంకుస్థాపన చేశామన్నారు. రూ.1.50 కోట్లతో ఫోర్టు రోడ్డు ఈద్గా, రూ.83 లక్షలతో ఉర్సు దర్గాను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. కేటీఆర్ చేతుల మీదుగా పలు అభివృద్ధి పనులు కూడా ప్రారంభించినట్లు తెలిపారు.
రూ.1.19 కోట్లతో మట్టెవాడ ఈద్గా, రూ.30లక్షలతో చింతల్ ఈద్గాను అభివృద్ధి చేస్తున్నామన్నారు. అలాగే, ఎల్బీనగర్లోని ఈద్గాను సైతం తాను మేయర్‌గా ఉన్నప్పుడు కట్టించినట్లు గుర్తు చేశారు. మండిబజార్ జెండా గద్దెకు రూ.12 లక్షలు నిధులు కేటాయించినట్లు తెలిపారు. నియోజకవర్గంలో ఏర్పా టు చేసిన మూడు మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వేల్పుగొండ సువర్ణ, బీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు బోగి సురేశ్, డివిజన్ అధ్యక్షుడు విజయ్, నాయకులు బిల్లా రవి, చందర్, కర్ణాకర్, భిక్షపతి, మైనార్టీ నాయకులు మోహిజ్, షౌకత్, ఇబ్రహీం, కరీం, రబ్బానీ పాల్గొన్నారు.